YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వారాహిపై ముందుకా... వెనుకకా...

వారాహిపై ముందుకా... వెనుకకా...

విజయవాడ, డిసెంబర్ 10, 
ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనరిజమ్. సినిమాల్లోనే కాదు.. పాలిటిక్స్‌లో కూడా పంచూ పవరూ ఉంటేనే కిక్కు అంటున్నారు. అదే సీక్వెన్స్‌లో ఆయన లేటెస్ట్‌గా చేసిన ఒక దుస్సాహసం.. బూమరాంగ్ అవుతోందట. ముచ్చటపడి తయారు చేసుకున్న వారాహి వాహనం షెడ్డుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడిందట. అవును, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అనే ట్యాగ్‌తో జనసేన ఇంట్రడ్యూస్ చేసుకున్న పవన్‌కల్యాణ్ చైతన్యరథం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌.. లోపలొక ఫోల్డబుల్ మీటింగ్ రూమ్.. టాప్‌ మీదికి చేరుకోడానికి ఒక పవర్‌లిఫ్టు.. రిఫ్రెష్‌మెంట్ డెస్క్.. ఇటువంటి స్పెషాలిటీస్ బోలెడన్ని. కానీ.. వీటితో పాటు గేర్లు, యాక్సిలేటర్లూ ఉన్నట్టే బండికి బ్రేకులు కూడా ఉంటాయ్‌గా.. ఆ బ్రేకులే పడబోతున్నాయట జనసేన వారి వారాహికి.మిలిటరీ తప్పితే మరే ప్రయివేటు వ్యక్తులూ తమ వెహికల్స్‌కి అలీవ్ గ్రీన్ కలర్ వాడటం నిషిద్ధం. అలా వాడితే రిజిస్ట్రేషన్ చెయ్యకూడదన్నది 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధన. ఆఖరికి మోటార్ బైక్ మీద కూడా ఆలివ్‌గ్రీన్ కనిపించకూడదన్నది రూల్. ఇంకేముంది.. జనసేన ఖాతాలో మరో విజయం.. అంటూ అధికారపక్షం నుంచి వీర లెవల్లో సెటైర్లు షురూ అయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ ప్రచార వాహనం ‘వారాహి’కి తెలుపు, నలుపు, మరో ఇతర రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్‌ గ్రీన్‌ రంగు వేశారని, ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా చేయరని, లక్షల పుస్తకాలు చదివానని చెప్పే పవన్‌.. ఇండియన్‌ మోటర్‌ వెహికల్‌ యాక్ట్‌ పుస్తకాన్ని చదివే సమయం దొరకలేదా? అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వేషాలు సినిమాలో వేయవచ్చని, నిజ జీవితంలో కుదరదని అన్నారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే నడవదన్నారు. కాల్‌షీట్ పొలిటీషియన్ కావడం వల్లే ఆయన ఇలా చేస్తున్నారని, చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్ట్ చదవడం మినహా ఆయనకు ఏదీ తెలియదని విమర్శించారు.ఇదిలాఉంటే.. కస్టమైజ్డ్ వాహనం రోడ్డెక్కాలంటే బోలెడన్ని ఫార్మాలిటీస్ ఉంటాయ్. రవాణా శాఖ అనుమతి లేకుండా ఏ వెహికల్లూ బైటికి రాదు. సేఫ్టీ, ఫిట్నెస్, కలరూ గట్రా అన్నీ పరిశీలించాకే అప్రూవల్ ఇస్తారు. ఈ విషయం జనసేన స్ట్రాటజిస్టులకు తెలియదా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆలివ్ గ్రీన్ రంగులేసుకుని రోడ్ల మీద తిరిగే మిగతా టూవీలర్లు, ఫోర్ వీలర్ల సంగతేంటి? అని జనసేన నుంచి వస్తున్న ప్రశ్నలు. సాక్షాత్తూ బ్రాండెడ్ కంపెనీలే మీక్కావల్సిన రంగు మా దగ్గర వుంది అంటూ.. కోరిన రంగులేసి సప్లయ్ చేస్తుంటే వాటినెవ్వరూ ప్రశ్నించరేం అని నిలదీస్తున్నారు జనసైనికులు. ఆమాటకొస్తే తెలుగుదేశం ఆవిర్భావం కోసం ఎన్టీఆర్ ఎక్కిన చైతన్య రథం రంగు కూడా దాదాపుగా ఆలివ్‌గ్రీనే అని కొత్త లాజిక్కును తెరమీదకు తెస్తున్నారు పవన్.
రోజంతా ట్వీట్స్..
ఎన్నికల యాత్ర కోసం తాను సిద్ధం చేసుకున్న వారాహి వాహనంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేయడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా తీసుకున్నారు. వాహనానికి వేసిన రంగు చట్ట విరుద్దమని.. చెల్లదని.. ఆర్టీఏ అనుమతి ఇవ్వదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పలువురు వైఎస్ఆర్‌ీపీ నేతలు అదే చెబుతున్నారు. దీనిపై జనసేన సీనియర్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తమకు చట్టాలు తెలియవా అని ప్రశ్నించారు. అంతా చట్ట ప్రకారమే ఛేశామన్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ రోజంతా .. వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉదయమే అలీవ్ గ్రీన్ కలర్ షర్ట్‌ను పోస్ట్ చేసి.. కనీసం తాను ఈ చొక్కానైనా వేసుకోనిస్తారా అని ప్రశ్నించారు. తరవాత విశాఖలోని ఓ పచ్చన ప్రాంతాన్ని చూపించి ఇలాంటి గ్రీన్ అయితే మీకు ఇష్టమేనా అని పోస్ట్ చేశారు. అది వైజాగ్‌ స్టేడియం పక్కన ఉన్న స్థలంగా భావిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పి..  ఆ ప్రాంతంలో ఉన్న పచ్చదనం మొత్తాన్ని కట్ చేసేశారు. విశాలమైన స్థలంగా మార్చారు. దీన్నే సెటైరిక్‌గా పవన్ కల్యాణ్ గుర్తు చేశారని భావిస్తున్నారు. తర్వాత  పవన్ కల్యాణ్‌కు మాత్రమే రూల్స్ అమలు చేస్తారా అని అలీవ్ గ్రీన్ కలర్‌లో ఉన్న కొన్ని వాహనాల ఫోటోలను పోస్ట్ చేశారు. ఈర్ష్యతో వైసీపీ రోజు రోజుకు కుంచించుకుపోతోందని మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత టిక్కెట్ రేట్లు.. రంగులు వంటి వాటి మీద కాదని..అభివృద్ధి పై దృష్టి సారించాలని సూచించారు.
పవన్ కల్యాణ్..  వైఎస్ఆర్‌సీపీ తన విషయంలో అన్నింటినీ వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. అందుకో రోజంతా ట్వీట్లు చేసినట్లుగా చెబుతున్నారు.

Related Posts