YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హస్తిన బాటలో గులాబీ వయా బెంగళూరు

హస్తిన బాటలో గులాబీ వయా బెంగళూరు

హైదరాబాద్, డిసెంబర్ 10, 
బీఆర్ఎస్‌గా మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే ఈనెల 14న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఢిల్లీలో ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. గులాబీ సైన్యం తరలి వెళ్లేందుకు రెడీ అవుతున్నది. పార్టీ ముఖ్య నేతలు మూడురోజుల ముందుగానే వెళ్లనున్నట్టు సమాచారం. వెయ్యిమందికిపైగా నేతలు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో మౌలిక సదుపాయాలు కల్పించారు. భవనానికి రంగులు సైతం వేశారు. వసతి, భోజనం ఏర్పాట్ల బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు అందరూ పాల్గొనాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. అంతేకాదు ఈనెల 13న సాయంత్రానికే ఢిల్లీ చేరుకోవాలని సూచించారు. దీంతో అందరూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.బీఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వెంటనే జాతీయ మీడియాతో కేసీఆర్ ఏం మాట్లాడతారనే చర్చనీయాంశమైంది. ఇప్పటికే కేంద్రంపై ఫోకస్ పెట్టి లోపాలను ఎత్తి చూపుతున్న ఆయన ఏయే అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకను కేవలం పార్టీ నేతలతోనే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై కేసీఆర్ అందులో క్లారిటీ ఇచ్చారు. కానీ మీడియా ముందుకు రాలేదు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇప్పటికే కొనసాగుతుండగా బీఆర్ఎస్ విధివిధానాలు ప్రకటించి, ఎంపీలతో కేంద్రాన్ని కేసీఆర్ ఎండగట్టే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనుసరించే విధానాలపై ప్రణాళిక ఇచ్చారు. పార్టీ పేరు మార్పుతో జాతీయ రాజకీయాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో వింటర్ సెషల్ లోనే రాజకీయ వేడి పుట్టించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది పార్టీవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.వచ్చే ఏడాదే కర్నాటకలో ఎన్నికలు జరగనుండగా జేడీఎస్, బీఆర్ఎస్ పోటీపై కేసీఆర్ ప్రకటించారు. కర్నాటక తరహాలోనే తమిళనాడు, ఏపీ, మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించ వచ్చని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 2024లో లోక్‌సభ ఎన్నికల్లో తెలుగువారు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. ముంబై, సూరత్‌, ఒడిశా, ఢిల్లీ లోనూ తెలుగువారి ప్రభావం ఉండగా ఆయా రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ స్థానిక పార్టీలతో పొత్తు కుదుర్చుకోవచ్చంటున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని తెలుగువారు కేసీఆర్ టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. పోటీకి రెడీగా ఉన్నట్టు కూడా సమాచారం. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీకి జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను సైతం ముమ్మరం చేసినట్లు తెలిసింది.

Related Posts