తిరుపతి
తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు నిరసన బాట పట్టారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేసారు. చెవుల్లో పూలు పెట్టుకుని తిరుపతి జిల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీలకు పాత పెన్షన్ ఇస్తూ ఉద్యోగులకు రద్దు చేయడంపై ఫైర్ అయ్యాయరు. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైంది. పాత పెన్షన్ విధానం అమలు చేయకపోతే ఆత్మహత్యలకు సిద్ధమని అన్నారు. 2023లో ఏడాదంతా నిరసనలు చేపడుతామని అన్నారు.