YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం

ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం

కర్ణాటక 25 వ ముఖ్యమంత్రిగా హెచ్‌డీ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి విధానసౌధ తూర్పు ద్వారం మెట్ల వద్ద వేదికను ఏర్పాటు చేస్తున్నారు.  రెండు రోజుల నుంచి పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే కుమార స్వామి ఒక్కరే ప్రమాణం చేయనున్నారు. మరో వైపు  మంత్రి పదవుల విషయంలో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. సామాజికవర్గ సమీకరణాలను వేసుకుని అనేక మంది మంత్రి పదవులను కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. లింగాయత్ సామాజికవర్గం ఎమ్మెల్యేలు అంతా కలిసి తమలో ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.కర్ణాటక ముఖ్యమంత్రి  ప్రమాణస్వీకారోత్సవానికి అంతా సిద్ధమైంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి సంబంధించి ఆహ్వాన పత్రికలను బీజేపీ యేతర రాష్ట్రాలకు అందచేశారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా, చంద్రబాబు, కేసీఆర్‌తో సహా పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన 24గంటల లోపే బలపరీక్ష ఉంటుందని కుమారస్వామి సూచనప్రాయంగా చెప్పారు. అంతవరకూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు స్టార్‌ హోటళ్లలోనే ఉంటారు. కాగా, డిప్యూటీ సీఎం పదవికి ప్రధానంగా డీకే శివకుమార్‌, ఎంబీ పాటిల్‌, జి పరమేశ్వర పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్‌ నేత శివశంకరప్పకు డిప్యూటీ సీఎం అవకాశమివ్వాలని, కనీసం ఐదుగురు వీరశైవ లింగాయతులకు కేబినెట్‌లో చోటు కల్పించాలని వారు కోరుతున్నారు.ఇక, రాష్ట్ర 25వ సీఎంగా హెచ్‌డీ కుమారస్వామి బుధవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారు. 12 ఏళ్ల తర్వాత ఆయన ఈ పగ్గాలు చేపడుతున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి విధానసౌధకు తూర్పు భాగం లో భారీవేదిక సిద్ధమవుతోంది. కుమారస్వామితో గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, యూపీ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, డీఎం అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్, ఆర్జేడీ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తదితర నేతలు ఆహ్వానించారు.మరోవైపు మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్- జేడీఎస్‌ల మధ్య ఇంకా చర్చలు సాగుతున్నాయి. సోమవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్న కుమారస్వామి తొలుత మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో జేడీఎస్- బీఎస్పీలు కలిసి పోటీచేసిన  భాగస్వామ్యపక్ష నేతగా ప్రమాణస్వీకారానికి ఆమెను ఆహ్వానించారు.మరో వైపు కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్‌లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంలో పదవుల కోసం లాబీయింగ్‌లు మొదలయ్యాయి. నాటకీయ రాజకీయ పరిణామాల మధ్యన ఏర్పడుతున్న ఈ ప్రభుత్వంలో పదవులను సంపాదించుకోవడానికి చాలా మందే ప్రయత్నాలు చేస్తున్నారు. కీలకమైన ముఖ్యమంత్రి పదవి జేడీఎస్ ఖాతాలోకి వెళ్లి పోతూ ఉండగా.. డిప్యూటీ సీఎం పదవులు, ఇతర మంత్రి పదవుల విషయంలో నేతలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. వివిధ రాజకీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా అనేక మంది పదవులను ఆశిస్తున్నారు. వీరి సంఖ్య పెద్దదిగానే ఉండటం, కీలకపదవులపై అనేక మంది ఆశలు పెంచుకొంటూ ఉండటంతో ఏం జరుగుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న నేతలు ఇతర పదవుల మీద పడ్డారు. అందులో ముఖ్యమైనవి డిప్యూటీ సీఎం పదవులు. కనీసం ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. వీటిల్లో ఒకటి కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఆ అవకాశం దళిత నేతకు దక్కనుందని..... పీసీసీ చీఫ్ పరమేశ్వరకు ఛాన్స్ దక్కవచ్చని సమాచారం. 

Related Posts