రాజమండ్రి, డిసెంబర్ 16,
దశాబ్దాలు తరబడి వంతెనల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.. అన్నీ పనులు ఆమోదం లభించింది అనుకునే లోపు ఏదో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి, లంక గ్రామాలలో ఏడో తరగతి వరకే స్కూలు ఉంటుంది.ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకురు నుండి బలుసు తిప్ప గ్రామం వరకు ఉన్న 10 గ్రామాలను, ఐ పోలవరం మండలం గుత్తెనదీవి మూల పొలం కలుపుతూ గోదావరి నది పాయపై వంతెన నిర్మించాలని అనుకున్నారు.. 2009 లో అప్పటి సీఎం వైఎస్ రామాలయంపేట జి మూలపాలెం 350 మీటర్ల వంతెన నిర్మాణానికి 22 కోట్లతో శంకుస్థాపన చేశారు.. ఆ బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్లు వేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించలేదు దానిపై కోర్టుకు వెళ్లడంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి.. కోర్టు కేసుల తర్వాత ఈ ప్రభుత్వంలో మోక్షం లభించింది.. 2021లో బ్రిడ్జి నిర్మాణం అంచనాని 76 కోట్లకు పెంచుతు ప్రభుత్వం టెండర్లుని ఆహ్వానించింది… కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కాట్రేనికోన మండలం పల్లంకురు పరిసర ప్రాంతాల్లో 30 వేల మందికి ఉపయోగము ఉంటుంది.. ముఖ్యంగా బలుసు తిప్ప పరిసర ప్రాంత మత్స్యకారులు తమ మత్స్య సంపదను అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది.. దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే సీఎం గోగుల్లంక వారిదికి శంకుస్థాపన చేశారు.. ఈ వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు.. దాంతో వాటి పనులు కూడా ప్రారంభం కాలేదు.. పడవలు ,పంట్లు మీద దాటించాలంటే లంక గ్రామస్తుల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రావాలన్నా వెళ్లాలన్న తలకు మించిన భారం అవుతుంది.. హాస్పిటల్ అవసరాల నిమిత్తం వెళ్లే వాళ్ళు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండడం లేదు.. స్థానికులు తరచూ వాహనాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తీసుకొని వెళ్తున్నారు ఒక్కొక్కసారి ప్రమాదకరం గా ఎక్కువ మందితో ప్రయాణం చేయాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. దాని వలన ఇబ్బందులు తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఒకవేళ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే దాదాపు 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. వరదలు వచ్చినప్పుడు ఏదో హంగామా సృష్టించే అధికారులు ప్రజాప్రతినిధులు తర్వాత అవకాశం ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడడం లేదు. దాంతో ఇక్కడి స్థానికులకి కష్టాలు అలవాటైపోయాయి.. ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. ఒక్కొక్కసారి ఆ ప్రవాహంలో పడిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి.