YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేజీఎఫ్ నుంచి బంగారం వెలికి తీయాలని యోచిస్తోన్నకేంద్రం

కేజీఎఫ్ నుంచి బంగారం వెలికి తీయాలని యోచిస్తోన్నకేంద్రం

న్యూ డిల్లీ డిసెంబర్ 16
గతంలో శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికి తీయాలని యోచిస్తోంది  కేంద్ర ప్రభుత్వం .కేజీఎఫ్ లో 2.1 బిలియన్ డాలర్ల విలువైన బంగారం నిక్షేపాలు ఉన్నాయని మోదీ సర్కార్ భావిస్తోంది. బంగారాన్ని వెలికి తీసేందుకు ఉన్న ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. బంగారంతో పాటు పల్లాడియంను కూడా వెలికి తీయాలని కేంద్రం భావిస్తోంది. అయితే కోలార్ గోల్డ్ మైన్స్ లో బంగారం నిక్షేపాలను వెలికితీసే ప్రక్రియ 20 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కోలార్ గోల్డ్ మైన్స్ పై ఆసక్తి చూపిస్తుంది. ఇందులో భాగంగానే కేజీఎఫ్ లో నిల్వ ఉన్న 50 మిలియన్ల శుద్ది చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికి తీసేందుకు బిడ్లను ఆహ్వానించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం.శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికి తీసే కంపెనీలను రాబోయే నాలుగు నెలల్లో బిడ్లకు ఆహ్వానించాలని కేంద్రం సమాలోచనలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బంగారాన్ని వెలికి తీసే సమర్థత విదేశాల్లోనే ఎక్కువగా ఉందని దీంతో ఆ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకొని లేదా కన్సార్షియం ఏర్పాటు చేసుకొని బంగారాన్ని వెలికి తీసేందుకు బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.గతంలో కేజీఎఫ్ నుంచి మట్టిని సేకరించిన తర్వాత గుట్టలుగా పోయారు. దీంతో కేజీఎఫ్ చుట్టురా 13 గుట్టలు పేరుకుపోయాయి. వీటి నుంచి బంగారం వెలికి తీసేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానించబోతుంది. 50 మిలియన్ల మట్టిని ఇప్పటికే సంబంధిత అధికారులు పరిశీలించారు.ఇక్కడి మట్టి 25 టన్నుల బంగారం నిపుణులు అంచనా వేసి కేంద్రానికి నివేదించారు.ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని చైనా తర్వాత భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది. భారత్ లో బంగారం డిమాండ్ ను తగ్గించడానికి కేంద్రం ఇటీవల సుకాన్ని సైతం భారీగా పెంచింది. ఈ క్రమంలో కేజీఎఫ్ గనులపై సైతం కేంద్రం దృష్టి సారించిందని తెలుస్తోంది. ఏది ఏమైనా దాదాపు 20 ఏళ్ల తర్వాత కేజీఎఫ్ తలుపులు తెరుచుకోనుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Related Posts