YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేసీఆర్ కు అల్లం నారాయణ శుభాకాంక్షలు

కేసీఆర్ కు అల్లం నారాయణ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ
భారత్ రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్) పార్టీ ఆవిర్భావం సందర్భంగా,  తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ.. బి ఆర్ ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ను ఢిల్లీ అధికారిక నివాసం లో కలిసి శుభాకంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పాలన ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, తెలంగాణ తో పాటు, దేశ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా, జాతీయ రాజకీయాలు, పాలనలో  గుణాత్మక ప్రత్యామ్నాయం కోసం సీఎం కేసిఆర్ కృషికి తెలంగాణ జర్నలిస్టు ల సంపూర్ణ మద్దతు ఉంటుందని అల్లం నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు.. అనే నినాదం తో నాడు ఉద్యమం లో కీలక భాగస్వామ్యం పోషించిన తెలంగాణ జర్నలిస్టులు, స్వయం పాలన ప్రారంభమైన నాటి నుంచి నేటివరకు, "సాధించుకున్నాం తెలంగాణ పునర్నిర్మించుకుందాం తెలంగాణ " అనే నినాదం తో  తెలంగాణ స్వయం పాలనలోని నూతన ప్రభుత్వానికి మద్దతు గా నిలిచిందన్నారు.
అదే విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు, దేశ ఫెడరల్ , లౌకిక వాద పరిరక్షణ కు సీఎం కేసిఆర్ ప్రారంభించిన జాతీయ రాజకీయ ఉద్యమానికి కూడా తమ మద్దతు కొనసాగుతుందని అల్లం నారాయణ స్పష్టం చేశారు

Related Posts