విజయవాడ, డిసెంబర్ 19,
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకే ముప్పు పొంచి ఉందని జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) భావిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్ఎస్జీ మరో సారి చంద్రబాబు భద్రతపై దృష్టి పెట్టింది. స్వల్ప వ్యవధిలో చంద్రబాబు భద్రతపై రెండు సార్లు సమీక్ష చేసింది. తాజాగా ఎన్ఎస్జీ తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వచ్చింది. చంద్రబాబు పర్యటించే ప్రదేశాలు.. కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు వంటి అన్ని అంశాలను నిశితంగా పరిశీలించింది. చంద్రబాబు ఛాంబర్ ప్రచార రథాలను పరిశీలించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రచార సమయంలో రాత్రిపూట బస చేసే బస్సును పరిశీలించి.. భద్రతా పరంగా కొన్ని మార్పులు సూచించింది. అలాగే టీడీపీ ప్రచార రథాలపైకి ఎక్కి మరీ పరిశీలించింది. రథం పై నుంచి ఆయన ప్రసంగించే ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్ఎస్జీ కీలకు సూచనలు చేసిందివాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినది ఆయన హైట్ కు సరిపోయేలా ఆయన ప్రసగించే చోట నిలువెత్తు బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని ఏర్పాటు చేయాలన్న ఎన్ఎస్జీ సూచన. ఆ తరువాత ఎన్ఎస్జీ బృందం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. ఇలా ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం గత నాలుగు నెలలలో ఇది రెండో సారి. గత ఆగస్టులో ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆయన భద్రతను ఎన్ఎస్జీ పెంచింది.గతంలోనూ ఒకసారి చంద్రబాబు భద్రతకు సంబంధించి కేంద్ర దర్యాప్తు బృందం ప్రత్యేకంగా పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల నందిగామలో పర్యటించిన సమయంలో రాళ్ల దాడి జరిగి.. ఆయన భద్రతా సిబ్బంది చీఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు హోం శాఖకు లేఖరాశారు. దీంతో చంద్రబాబు భద్రత అంశంపై మరోసారి ఎన్ ఎస్ జీ బృందం పరిశీలనకు రావడం గమనార్హం. అప్పట్లో చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబుకు అతి సమీపానికి అధికార వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై సమీక్షించిన ఎన్ఎస్జీ ఇప్పుడు తాజాగా ఆయన భద్రతకు సంబంధించిన అంశాలను మరోమారు పరిశీలించి సమీక్షించడంతో ఆయనకు ముప్పు ఉందన్న సంగతిని తెలియజేస్తున్నాయి. ఇక తాజాగా ఎన్ఎస్జీ సమీక్ష కు కారణమేమిటంటే.. ఇటీవల నందిగామలో పర్యటించిన చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. అది చంద్రబాబుకు కాకుండా ఆయన సెక్యూరిటీ చీఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై చంద్రబాబు హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీంతో చంద్రబాబు భద్రత అంశంపై మరోసారి ఎన్ ఎస్ జీ బృందం పరిశీలనకు వచ్చింది. జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉన్న చంద్రబాబు భద్రత విషయంలో ఎటువంటి అలసత్వానికీ తావు ఉండరాదన్న భావనతోనే ఎన్ఎస్జీ నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఆయన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిదని చెబుతున్నారు