YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీఆర్ఎస్ లో కనిపించని జాతీయ నేతలు

బీఆర్ఎస్ లో కనిపించని జాతీయ నేతలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 19, 
భారత రాష్ట్రసమితి పేరులో భారత్ ఉంది తప్ప ఏ రకంగా చూసినా ఆ పార్టీకి జాతీయ హోదా ఉన్నదన్నభావన కలగదు. ఇక్కడ హోదా అంటే అధికారిక గుర్తింపు కాదు. పార్టీకి జాతీయ స్థాయి. ఆ స్థాయి ఇప్పుడున్న బీఆర్ఎస్ లో ఆ స్థాయి ఇసుమంతైనా కనిపించలేదు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన వారిలో రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరంటే ఇద్దరు మాత్రమే ప్రముఖులు ఉన్నారువారిలో ఒకరు హెచ్ డి కుమారస్వామి కాగా, మరొకరు ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్. వీరిరువురు మినహా రైతు నేతలంటూ వచ్చిన ఎవరూ  కూడా పెద్దగా రాజకీయ గుర్తింపు ఉన్న వారు కారు. చివరాఖరికి పలు దఫాలుగా బీఆర్ఎస్ రైతు అజెండాపై ప్రగతి భవన్ కు వచ్చి మరీ కేసీఆర్ తో రోజుల తరబడి చర్చలు జరపిన రైతు నాయకుడు తికాయిత్ కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎక్కడా కనిపించలేదు. ఇక హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం రోజున పొద్దుట నుంచి సాయంత్రం వరకూ కేసీఆర్ ను కలిసిన నేతలందరూ తెరాస నాయకులే. హస్తినలో కేసీఆర్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారన్న కలర్ ఇచ్చుకోవడానికే తెరాస నేతలు హస్తిన వచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్త మయ్యాయి.కాకుండా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం జనంతో కళకళలాడిందని చెప్పు కోవడానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను తరలించారని కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఒక్కో ఎమ్మెల్యే టార్గెట్లు నిర్దేశించుకుని మరీ కార్యకర్తలను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలించారని చెబుతున్నారు.  ఏతా వాతా అందరూ చెప్పేదేమిటంటే బీఆర్ ఎస్ కేంద్ర కార్యాలయంలో కనిపించిన వారంతా తెలంగాణ నేతలే. అంటే బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ కు కొత్తగా క్యాడర్ కానీ, లీడర్ కానీ వచ్చి చేరలేదు. అంటే బీఆర్ఎస్ లో ఉన్నదంతా పాత టీఆర్ఎస్ నాయకత్వం, కార్యకర్తలేననిపరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు.మామూలుగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులకు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తుంటారు. కనీసం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టిన సందర్బంగా ఆయనకు ఇతర పార్టీల నేతల నుంచి అలా శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు లేవు. కనీసం సాటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ కూడా కేసీఆర్ కొత్త పార్టీపై స్పందించలేదు. ఏపీ ప్రభుత్వ సలహాదారు ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయవచ్చు అంటూ చెప్పినా యథాలాపంగా ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అంతే.   కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వచ్చినా అందుకు రాజకీయంగా పెద్ద ప్రాముఖ్యత లేదు. ఆయన పార్టీని.. కర్నాటకలోనే పెద్దగా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.  కేసీఆర్ నుంచి ఆహ్వానం అందుకున్న వారు కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడమే.. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఏకాకిగా మిగిలిపోయిందని చెప్పడానికి తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు.  హస్తినలో కూడా కేసీఆర్ చుట్టూ ఉన్నది తెలంగాణ నేతలే కావడం చూస్తుంటే..  పేరుకే బీఆర్ఎస్ కానీ దాని రుచి, రంగూ, వాసనా అంతా టీఆర్ఎస్సే అన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోందని అంటున్నారు.

Related Posts