YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పీఆర్పీ నేతలకు జనసేనాని గాలం

పీఆర్పీ నేతలకు జనసేనాని గాలం

రాజమండ్రి, డిసెంబర్ 20, 
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేన ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇప్పటివరకు పార్టీ ప్లస్ లు మైనస్ లు అంచనాలు వేసుకున్న నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారట. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓట్లు సీట్లలో పీఆర్పీ ఉనికి చాటుకుంది. మొత్తం 19 స్థానాలుగాను నాలుగుచోట్ల గెలవగా, 8 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 5 చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీల్చింది ప్రజారాజ్యంపార్టీ. గత ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలులో పోటీ చేసినప్పటికీ జనసేన ఒక్కచోటే గెలిచింది. 2019లో వచ్చిన ఓట్లను దగ్గర పెట్టుకుని కొత్త సమీకరణాలతో గ్లాసు పార్టీ పెద్దలు కుస్తీ పడుతున్నారట. అప్పట్లో పీఆర్పీలో యాక్టివ్‌గా పనిచేసి ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న నేతల గురించి ఆరా తీస్తున్నారట. వారికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? జనసేనపై వారి అభిప్రాయం ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారట. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ కొత్తవారే. ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన వారే. అయినప్పటికీ వారికి అప్పట్లో ఆస్థాయిలో ఓట్లు ఎలా వచ్చాయి? పార్టీ మైలేజ్ ఎంత? ఓన్ వోట్ షేరింగ్ ఏముంది అనే సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నారట జనసేన నాయకులు.గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్లలో ప్రస్తుతం వైసీపీలో కొందరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరికొందరు ప్రతిపక్షంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే పూర్తిగా పాలిటిక్స్‌కి దూరమైన వాళ్ళు ఎవరున్నారు? వారి ఉద్దేశం ఏంటో తెలుసుకుంటున్నారట. ఎప్పుడో అవుట్ డేటెడ్ నేతలు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని కొందరు అంటుంటే.. అదనపు బలం వస్తుంది కదా అని మరికొందరు వాదిస్తున్నారట. సామాజిక వర్గాల వారీగా పలానా నేత పలానా వారి దగ్గరికి వెళ్లి ప్రతిపాదన పెట్టాలని జనసేన నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయట. గతంలో పీఆర్పీలో పెద్దాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన పంతం గాంధీ మోహన్ తర్వాత వైసీపీలో చేరినా సైలెంట్ అయ్యారు. పి గన్నవరంలో పోటీ చేసి ఓడిన జంగా గౌతమ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అటువంటి వారిపైనా దృష్టిపెట్టారట.జిల్లా, రాష్ట్ర స్థాయిలో పీఆర్పీ తరపున పని చేసిన వారిని తిరిగి యాక్టివ్ కావాలని కోరుతున్నారట జనసేన నాయకులు. ప్రస్తుతం సీటు మీద ఆశలు పెట్టుకున్న నేతలకు పొత్తుల్లో తమ ప్లేసు ఎక్కడ పోతుందోనన్న భయం నెలకొంది. ఇదే సమయంలో కొత్తవారు వస్తే కష్టమేనని ఆందోళన చెందుతున్నారట. అయితే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయని.. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జనసేన పెద్దల నుంచి వర్తమానం అందిందట. గెలుపోటములను డిసైడ్ చేసే వారూ ఉంటే కచ్చితంగా వారిని చేరదీయాలని స్పష్టం చేస్తున్నారట. మొత్తానికి అన్నయ్య సెలెక్ట్ చేసిన అభ్యర్థులు.. నేతలపై తమ్ముడు ఫోకస్ పెట్టారు. మరి ఈ కూడికలు తీసివేతలు ఫార్ములా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Related Posts