YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వివాదాల పఠాన్

వివాదాల పఠాన్

న్యూఢిల్లీ, డిసెంబర్ 20, 
షారుఖ్‌ సినిమా పఠాన్‌ చుట్టూ వివాదాలే. ఒకదాని తర్వాత ఒకటి.. ఒకరి తర్వాత మరొకరు కాంట్రవర్సీలను లేవనెత్తుతున్నారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ పఠాన్‌. ఈ  చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదం మొదలైంది. రోజు రోజుకు వివాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై దుమారం చెలరేగింది. సినిమాలో కాషాయ రంగును మార్చాలని పలువురు డిమాండ్‌ చేశారు. పలు హిందూ సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు కూడా పఠాన్ సినిమాను బ్యాన్‌ చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి.ఇప్పుడు ఇంకో వివాదం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వరకు వెళ్లింది. వచ్చే జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న పఠాన్‌ మూవీపై దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలోని బేషరం రంగ్‌ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'బాయ్‌కాట్ పఠాన్' హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో  ట్రెండ్ చేస్తున్నాయి.ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. ఆ సాంగ్‌లో దీపిక, షారూక్ ధరించిన దుస్తుల్ని త‌ప్పుప‌డుతున్నారు.అయితే ఈ వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. సినిమా యూనిట్‌కు మద్దతు తెలిపారు." కాషాయం ధరించి రేపిస్టులను సత్కరిస్తే, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే తప్పులేదు. బ్రోకర్ ఎమ్మెల్యేలు, కాషాయ స్వామీజీలు.. మైనర్లపై అత్యాచారం చేసినా పట్టదు. కానీ ఒక సినిమాలో ఆ డ్రెస్ ధరించకూడదా?.                               "
-     ప్రకాశ్ రాజ్, సినీ నటుడు
'పఠాన్' సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ట్రైలర్ పై కూడా నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. ఈ సినిమా హాలీవుడ్ వార్ అండ్ మార్వెల్స్ కు కాపీ లా ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ మూవీను బ్యాన్ చేయాలంటూ కూడా కామెంట్లు వచ్చాయి. తర్వాత 'బేషరమ్ రంగ్' పాటపై కూడా ఇదే రీతిలో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటలో షారుక్-దీపికా కెమిస్ట్రీ బాగుందని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంత బోల్డ్ గా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్టీఐ కార్యకర్త డానిష్‌ ఖాన్‌ ‘బేషరమ్‌ రంగ్‌’పై NHRCకి ఫిర్యాదు చేశారు. పాటను సినిమా నుంచి తొలగించేలా ఆదేశించాలని కోరారు. కాషాయ రంగుకు ముస్లిం సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉందని.. ఇది ముస్లిం సమాజానికి చిస్తీ రంగంటున్నారు. పాట సైతం హిందూ – ముస్లింల ఐక్యత, మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదుచేశారు.పఠాన్‌ సినిమాపై మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీపికా కాషాయ రంగు బికినీ ధరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్‌, వీర్‌ శివాజీ గ్రూప్‌లు సైతం మండిపడ్డాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం పఠాన్‌. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Related Posts