YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్రం పై ధర్మ పోరాటమే

కేంద్రం పై ధర్మ పోరాటమే

ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదాను కేంద్రం ఎప్పటికైనా ఇచ్చి తీరాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రాబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ ధర్మపోరాటం దీక్షలతో కేంద్రంపై తప్పకుండా ఒత్తిడి పెరుగుతుందని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని, అందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే పోరాటం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ విషయంలో సక్సెస్ అవుతామని తమకు పూర్తి నమ్మకం ఉందనన్నారు. తాము చేస్తున్న పోరానికి అన్ని విధాల సహకారం అవసరమని... ఇందుకోసం అన్నివర్గాలవారిని ఆహ్వానిస్తున్నామని అనిత పేర్కొన్నారు. తమకు ప్రతిపక్షం కూడా సహకరించాలని కోరారు. వైసీపీ మాత్రం తమ కేసులు మాఫీ చేసుకోవడం కోసమో, సొంత ఎజెండాలతో ముందుకు వెళుతుందని, కేంద్రాన్ని ఒక్క మాట కూడా విమర్శించడం లేదని, వైసీపీ తీరుపై ఎమ్మెల్మే ధ్వజమెత్తారు. ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ ధర్మపోరాటం చేస్తోందని, మిగిలిన పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసిరాకపోగా బీజేపీని విమర్శించే పరిస్థితి కనిపించడంలేదని అనిత తీవ్ర స్థాయిలో విమర్శించారు.టీడీపీపై బీజేపీ, వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలు మూకుమ్మడి దాడి ప్రారంభించాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  బీజేపీ, జగన్, పవన్ లు టీడీపీని ఏమీ చేయలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల గొంతు కోస్తే.. బీజేపీ వంచన చేసిందని, నాలుగేళ్లలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పి, ఓట్లు అడుగుతామని అన్నారు. కష్టకాలంలో టీడీపీ పాలనా పగ్గాలు చేపట్టిందని, విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు గట్టెక్కించారని ప్రశంసించారు. 2019లో చంద్రబాబు గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. జగన్ తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని, రాజీనామాల డ్రామాలాడుతున్న వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని ఆరోపించారు.

Related Posts