న్యూఢిల్లీ, డిసెంబర్ 23,
నాసా మార్స్ మీదకు ఓ రోవర్ ను పంపించందని తెలుసుకదా. పర్ సివరెన్స్ అని పిలుచుకుంటున్న ఈ రోవర్ 2021 నుంచి ఫిబ్రవరి నుంచి మార్స్ మీదే తిరుగుతూ వందల ఫోటోలు తీసింది. అక్కడి రాళ్లు, మట్టి, గాలి నుంచి శాంపుల్స్ తీసుకుంది. సరే తీసుకుంది మరి వాటిని భూమి మీదకు తీసుకురావటం ఎలా. ఆ మట్టిని రాళ్లను తీసుకువచ్చి పరిశోధనలు చేస్తేనే కదా అసలు అంగారుకుడి మీద జీవం బతికేందుకు ఆస్కారం ఉందో లేదో తెలిసేది. ఇప్పుడు ఆ దిశగా ఓ కీలక అడుగు వేసింది పర్ సివరెన్స్ రోవర్. నాసా పర్ సివరెన్స్ రోవర్ మార్స్ మీద తిరుగుతూ ఇప్పటి వరకూ 17 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇందులో ఒక ఎయిర్ శాంపుల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రోవర్ తను కలెక్ట్ చేసిన శాంపుల్స్ లో 10 శాంపుల్స్ ను మార్స్ మీద జాగ్రత్త జార విడిచే పని ప్రారంభించింది. అందులో మొదటి శాంపుల్ గా ఓ టైటానియం ట్యూబ్ ను ఇదుగో ఇలా సక్సెస్ ఫుల్ గా విడిచి పెట్టింది. ఈ శాంపుల్ ను జనవరి 31న కలెక్ట్ చేసింది రోవర్. మార్స్ మీద జెజెరో క్రేటర్ లో ముందుగా నిర్దేశించిన ఓ స్పెసిఫైడ్ ప్లేస్ లో ఈ శాంపుల్ ను పర్ సివరెన్స్ రోవర్ విడిచి పెట్టింది. ఇలా మొత్తం పదిశాంపుల్స్ ను రానున్న రెండు నెలల్లో విడిచి పెడుతుంది. ఈ మొత్తం పదిశాంపుల్స్ ఉండే ఏరియా ఇదుగో ఇలా మ్యాప్ లా ఉంటుంది. దీన్ని త్రీ ఫోర్క్ అని పిలుస్తోంది నాసా. మిగిలిన ఏడు శాంపుల్స్ ను బ్యాకప్ శాంపుల్స్ గా రోవర్ తన దగ్గరే పెట్టుకుంటుంది. వాటిని మరో పాయింట్ దగ్గర జాగ్రత్త భద్రపరుస్తుంది. ఇదంతా ఎందుకంటే మనం మార్స్ శాంపుల్ రిటర్న్ క్యాంపెయిన్ గురించి మాట్లాడుకోవాలి.నాసా పర్ సివరెన్స్ తీసిన శాంపుల్స్ ను భూమి మీదకు తీసుకువచ్చే ప్రాజెక్టే ఈ మార్స్ శాంపుల్ రిటర్న్ క్యాంపెయిన్. ఇందుకోసం 2027 నాటికి మార్స్ కక్ష్యలోకి ఓ ఆర్బిటర్ చేరుకునే ఈ ప్రయోగాన్ని ప్లాన్ చేస్తోంది నాసా. 2028 సంవత్సరం మొదట్లో ఈ ఆర్బిటర్ నుంచి ల్యాండర్ మార్స్ మీదకు దిగుతుంది. ఎగ్జాట్ గా ఈ శాంపుల్స్ ఇప్పుడు రోవర్ వదిలేస్తున్న పాయింట్ లోనే దిగుతుంది నాసా ల్యాండర్. సపోజ్ మన నాసా పర్ సివరెన్స్ కు అప్పటికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు కదా. అందుకే ఇలా ముందు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకునే విధంగా శాంపుల్స్ ను కొంచెం దూరం దూరంగా విడిచి పెడుతుంది. 2028 లో దిగే ల్యాండర్ లో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒక రోవర్ మిషన్ పర్ సివరెన్స్ రోవర్ వదిలిపెట్టిన శాంపుల్స్ ను తీసుకుని...శాంపుల్స్ స్టోరేజ్ ప్లేస్ లో జాగ్రత్తగా పెడుతుంది. అప్పుడు ఈ ల్యాండర్ లో ఉన్న చిన్నపాటి రాకెట్ ద్వారా శాంపుల్స్ అన్నీ మార్స్ కక్ష్యలోకి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. ఇదే టైం లో నాసా మరో స్పేస్ క్రాఫ్ట్ ను మార్స్ కక్ష్యలో సిద్ధంగా ఉంచుతుంది. రాకెట్ ద్వారా వచ్చిన శాంపుల్స్ ను ఆ స్పేస్ క్రాఫ్ట్ తీసుకుని...అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టి 2033 నాటికి భూమి మీదకు చేరుకుంటుంది. నాసా శాస్త్రవేత్తలు ఆ శాంపుల్స్ పై పరిశోధనలు చేసి అంగాకరుడిపై జీవం ఉండేందుకు ఆస్కారం ఉందా లేదా తేల్చి చెబుతారు. సో మరో పదేళ్లలో మనుషులు అంగారకుడిపైకి వెళ్లి నివాసాలు ఏర్పరుచుకోగలరా లేదా అనే అంశంపై ఓ క్లారిటీ అయితే రానుంది. అందుకే నాసా ఈ మొత్తం ప్రయోగాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించి జాగ్రత్తగా ఒక్కో స్టేజ్ ను జాగ్రత్తగా కంప్లీట్ చేస్తోంది.