YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా నాలుగో డోస్ వేసుకోవాలా...

కరోనా నాలుగో డోస్ వేసుకోవాలా...

హైదరాబాద్, డిసెంబర్  23, 
మరోసారి కరోనా వ్యాప్తి మొదలైంది. దాదాపు ఏడాదిగా ప్రభావం తగ్గిపోయింది అనుకుంటున్న ఈ సమయంలో మళ్లీ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ ఇదే వేరియంట్ కేసులు మూడు నమోద య్యాయి. ఫలితంగా...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి అంటూ మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే...ఇప్పటికే చాలా మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మూడు డోసులు తీసుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్లకు కూడా ఈ కొత్త వేరియంట్ సోకుతుందా..?అన్న అనుమానంపై శాస్త్రవేత్తలు స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 వ్యాక్సిన్ తీసుకున్న వారికీ సోకుతోందని, కాకపోతే...ప్రభావం తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. అందుకే కేంద్రం ప్రికాషనరీ డోస్‌ అందరికీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎప్పటి నుంచో దీనిపై అవగాహన కల్పిస్తున్నా...కరోనా పోయింది కదా అనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది మాత్రమే ఈ డోస్ తీసుకున్నారు. దేశ జనాభాలో కేవలం 27% మందికి మాత్రమే ప్రికాషనరీ డోస్ అందిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవలే కరోనా కట్టడి చర్యలపై సమావేశం జరగ్గా...నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ సిటిజన్లు తప్పకుండా ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్లు కూడా నాలుగో డోస్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కూడా వ్యాక్యినేషన్‌పై స్పందించారు. మూడో డోస్ తీసుకుంటే సరిపో తుందని అన్నారు. "నాలుగో డోస్ తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి కనిపించడం లేదు. బైవాలెంట్ లాంటి కొత్త వ్యాక్సిన్‌ తయారు చేస్తే తప్ప నాలుగో డోస్ అవసరం ఉండకపోవచ్చు" అని స్పష్టం చేశారు. రెండు వైరస్‌లపై ఒకేసారి ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతే కాదు. వాటి సబ్‌ వేరియంట్‌లనూ కట్టడి చేయగలదు. ఒరిజినల్ వైరస్ స్ట్రెయిన్‌ నుంచి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో...ఒమిక్రాన్ స్ట్రెయిన్‌తోనే బైవాలెంట్ వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. ఫలితంగా...ఈ వైరస్‌కు సంబంధించిన అన్ని వేరియంట్‌లపైనా ఇది సమర్థంగా పని చేస్తుంది. బూస్టర్ డోస్‌కి ఇది అప్‌డేటెడ్ వ్యాక్సిన్‌గానూ పిలుచుకోవచ్చు. అయితే...ప్రస్తుతానికి భారత్‌లో వినియోగించే వ్యాక్సిన్‌లలో ఏదీ బైవాలెంట్ కాదు. ఇతర దేశాల్లో ఫైజర్, బయోఎన్‌టెక్ బై వాలెంట్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక బూస్టర్ డోస్ విషయానికొస్తే...దీని ప్రభావం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని కొందరు వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. mRNA వ్యాక్సిన్‌లను ఇతర దేశాల్లో నాలుగో డోస్‌గా వినియోగిస్తున్నారు. మూడో డోస్‌ కన్నా సమర్థంగా ఇవి పని చేస్తున్నాయి. అందుకే...నాలుగో డోస్ అవసరం కొందరు స్పష్టం చేసింది

Related Posts