
ఈ రోజు రాత్రి 7 గంటలకు కోలకతా రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచినా వారు హైదరాబాద్ తో క్వాలిఫైయర్ 2 ఆడతారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఈ సీజన్‌లో ఇంటా, బయటా జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై కోల్‌కతాదే పైచేయి. ఆఖరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ సన్‌రైజర్స్‌కు ఝలక్ ఇచ్చిన రైడర్స్.. ఎటువంటి సమీకరణలకు తావులేకుండా ఫ్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంతగడ్డపైనే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుండడం కోల్‌కతాకు కలిసి వచ్చే అంశం.