YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్ అరెస్ట్..

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్ అరెస్ట్..

ముంబై, డిసెంబర్ 24, 
ఆమె ఒకప్పుడు బ్యాంకింగ్‌ రంగంలో వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు ఆమె కటకటాలు లెక్కించాల్సి వస్తోంది. చేసిన ఒక తప్పు ఆమెను ఐదేళ్లుగా వెంటాడుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్‌కొచ్చర్‌ను కూడా లోపలేశారు. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ. 3వేల కోట్లు పైగా లోన్‌ ఇచ్చిన కేసులో ఇద్దరినీ ఢిల్లీలో అరెస్ట్‌ చేసింది సీబీఐ. వీరిద్దరినీ ముంబైలోని స్పెషల్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఈఓ గా, ఎండీగా పనిచేశారు చందాకొచ్చారు. ఆమె ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు.. వీడియోకాన్‌ గ్రూప్‌ నకు 3వేల కోట్ల రూపాయలకు పైగా లోన్‌ ఇప్పించారని, ఆ డీలింగ్స్‌ ద్వారా చందా కొచ్చర్ భర్త దీపక్, కుటుంబ సభ్యులకు లబ్ది కలిగిందని కేసు నమోదైంది. ఈ ఆరోపణలపైనే 2018లో ఆమె ICICI బ్యాంక్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ తాజాగా.. భార్యాభర్తలిద్దరినీ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరిపై క్రిమినల్‌ అభియోగాలతో పాటు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 3వేల కోట్ల రూపాయలకుపైగా లోన్‌ ఎన్‌పీగా మారడంతో చందాకొచ్చర్‌ కుటుంబం అవినీతి వెలుగులోకి వచ్చింది. వీడియో గ్రూప్‌కు రుణాల కేటాయింపు అంశం తెరపైకి రావడంతో.. అప్పటివరకూ బ్యాంకింగ్‌ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రతిష్ట మసకబారింది.

Related Posts