YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మద్య రాజకీయాలు....

మద్య రాజకీయాలు....

దేశం మొత్తం రాజకీయాలను మద్యం డామినేట్ చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరై పోతుంటే.. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రం మరో కారణంతో మద్యం రాజకీయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. బీహార్ లో కల్తీ మద్యం మృతుల విషయంలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో కల్తీ మద్య నిషేధం యథేచ్ఛగా ఏరులై పారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు  నితీష్ కుమార్ చాలా దీటుగా, ఘాటుగా సమాధాన మిచ్చారు. బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉందనీ, ఆ విషయాన్ని ప్రస్తుతిండం మాని కల్తీ మద్యంపై తనను విమర్శించడమేమిటని నిలదీస్తున్నారు. మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ తో పాటు దేశంలో మద్య నిషేధం అమలులో లేని రాష్ట్రాలలోనూ కల్తీ మద్యం పై విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేస్తున్నారు. బీహార్ శరన్ జిల్లాలో జరిగిన కల్తీ మద్యం మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తును ప్రశ్నించిన నితీష్, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) కి దమ్ముంటే ఇతర రాష్ట్రాలలోనూ కల్తీ మద్యం మృతుల ఘటనలపై దర్యాప్తు చేపట్టాలని సవాల్ చేశారు. కల్తీ మద్యం కాటుకు మరణిస్తున్న సంఘటనలు ఒక్క బీహార్ లోనే కాదు.. దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ జరుగుతున్నాయని నితీష్ అంటున్నారు.  బీహార్ లో ఏడేళ్ల కిందటే ( ఇంకా సరిగ్గా చెప్పాలంటే 2016) నుంచీ మద్యం తయారీ, విక్రయాలు, వినియోగం అన్నిటిపైనా సంపూర్ణ నిషుధం అమలులో ఉంది. ఆల్కహాల్ సేవనంతో మరణాలు దేశంలోని ఏ ప్రాంతంలో జరగటం లేదు? గతంలో ఇలాంటివి జరగ లేదా? విషపూరితమైన కల్తీ మద్యం తాగి ఎంతమంది మరణించ లేదు? మరి అలాంటప్పుడు మానవ హక్కుల కమిషన్ కేవలం బిహార్ లోనే ఎందుకు దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపుతోంది? ఎన్ హెచ్ ఆర్సీ వెనుక ఉన్నది బీజేపీయేనా? అంటూ   నితీష్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన  బాధ్యత ఎన్ హెచ్ ఆర్సీపై ఉంది.అలాగే బీహార్ లో కల్తీ మద్యం మరణాలను భూతద్దంలో చూపి విమర్శలు గుప్పించే బీజేపీకి ఇతర రాష్ట్రాల్లో జరిగే ఇలాంటి మద్యం మరణాలు కనిపించవా అన్నప్రశ్నలూ తలెత్తుతున్నాయి.  అయితే నితీష్   ప్రశ్నలపై బీజేపీ స్పందించడంలేదు. అయితే మద్యం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్న డిమాండ్ ను మాత్రం బీజేపీ బలంగా చేస్తోంది.  మొత్తం మీద  82 మంది ఉసురు తీసిన బిహార్ కల్తీ మద్యం వ్యవహారంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రశక్తే లేదని బీహార్ సీఎం చేసిన ప్రకటన మాత్రం విపక్షాలకు ఆయుధంగా మారింది. నిజానికి మద్య నిషేధం బిహార్, గుజరాత్ లో అమల్లో ఉందన్న మాటే కానీ ఎక్కడా  నిషేధం ఆనవాలు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2015లో మద్య నిషేధం బిల్లు బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఈ బిల్లు కుమద్దతు ఇచ్చింది.    ఇప్పుడు అదే బీజేపీ ఇదే విషయంపై నితీష్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. అప్పట్లో  ప్రధాని మోడి కూడా నితీష్ ను ఒకప్పుడు ప్రశంసించి, మద్య నిషేధంతో నితీష్ చాలా సాహసోపేతమైన అడుగులు వేస్తున్నారని” మోడీ అభినందించారు. ఇక మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో సైతం  కల్తీ మద్యం కారణంగా 42 మంది ప్రాణాలు  కోల్పోయిన  సంగతిని బీజేపీ ఇప్పుడు కన్వీనియెంట్ గా మరచిపోయింది.  బిహార్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్య నిషేధం బిల్లు పాసైనా ఒక్క ఆర్జేడీ మాత్రం ఈ చట్టం అమలుపై సందేహాలు వెలిబుచ్చింది. అంతకు ముందు లాలూ సీఎంగా ఉన్నప్పుడు మద్యంపై ఏకంగా పన్నునే ఎత్తేశారు! మద్య నిషేధాన్ని నితీష్ ప్రకటించగానే ..  డ్రై స్టేట్ లో రెవిన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇలా డ్రై స్టేట్ అయితే కొత్త పెట్టుబడులు రావని విమర్శలు గుప్పించిన వారంతా. అప్పటికే మద్య నిషేధం అమలులో ఉన్న మ  గుజరాత్ కు పెట్టుబడుల వరద ఎలా వస్తోందని మాత్రం ప్రశ్నించలేదు. అలాగే 2016లో నితీష్ బీహార్ లో మద్య నిషేధం విధించినప్పుడు మోడీ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు ఒప్పన్నది ఇప్పుడు తప్పు అంటున్నారు.అలాగే మోడీ  పెద్దనోట్లు రద్దు చేయడాన్ని అప్పట్లో నితీష్ సమర్ధించారు. ఇప్పుడు అది పెద్ద కుంభకోణం అని విమర్శిస్తున్నారు.  రాజకీయం అంతే. మొత్తం మీద దేశం అంతటా మద్యం రాజకీయమే నడుస్తోంది. ఇందుకు ఏ రాష్ట్రం కూడా మినహాయింపు కాదు.

Related Posts