ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో పెన్షన్లు తొలగింపు పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.... అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు... ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు...ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇస్తున్న పెన్షన్, రేషన్ కార్డులను అతి కిరాతకంగా తొలగించారని అన్నారు... గతంలో పనిచేస్తున్న చంద్రబాబు కన్నా ఎక్కువ స్థాయిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారని 150 స్థానాల్లో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారని.. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి సొంత నిధులు ఏమీ ఇవ్వట్లేదని, ప్రజలు టాక్స్ రూపంలో కట్టే నగదును తిరిగి ప్రజలకు ఇస్తున్నారని అన్నారు... గత ప్రభుత్వాల్లో ఇచ్చిన పెన్షన్లను తొలగించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు... వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల కి 175 ఇచ్చేందుకు ప్రజలు చెవిలో పూలు పెట్టుకోలేదని అన్నారు... సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర లో గ్యాంబ్లింగ్ చేసి తన సొంత ఖాతాల్లో డబ్బులు వేసుకుంటున్నాడని ప్రజలందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.