YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పద్మ అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర నిరాశే

పద్మ అవార్డుల్లో  తెలంగాణకు తీవ్ర నిరాశే

రాష్ట్రం 25 మంది పేర్లను సిఫార్సు చేస్తే..

 పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది కూడా అదే పరిస్థితి. అయితే ఎపి నుంచి కిడాంబి శ్రీకాంత్ పద్మశ్రీ అవార్డు పొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 25 చొప్పున నామినేట్ చేశాయి.

తెలంగాణ రాష్ట్రం 25 మంది పేర్లను సిఫార్సు చేస్తే ఒక్కరికి కూడా అవార్డు లభించలేదు. భారతదేశం అత్యున్నత పురస్కారం భారత రత్న కోసం మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది.

పద్మ విభూషణ్‌కు జయశంకర్ పేరు...

పద్మ విభూషణ్ కోసం తెలంగాణ ప్రభుత్వం స్వర్గీయ జయశంకర్ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ అవార్డు కోసం ప్రముఖ ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. కవి నవలా రచయి శివ్ కె కుమార్ కూడా ఈ అవార్డుకు సిఫార్సు చేసినవారిలో ఉన్నారు.

పద్మశ్రీకి వీరి పేర్లు...

తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుల కోసం ప్రజా గాయకులు గోరటి వెంకన్న,, అందేశ్రీ పేర్లను సిఫార్సు చేసినట్లు మాచారం .విద్యావేత్త చుక్కా రామయ్య, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్లను కూడా ఈ అవార్టులకు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసినట్లు సమాచారం.

పివి సింధు పేరు..బ్యాడ్మింటన్ స్టార్ పివి సిందు పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కూచిపూడి నాట్యకారిణి ఆనంద శంర్ జయంత్, ఎంపి మురళీమోహన్, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు, ప్రముఖ వైద్యుడు విష్ణువర్ధన్ రె్డి, జగదీస్ పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

ఒకే ఒక్కడు శ్రీకాంత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మ అవార్డుకు ఒకే ఒక్కడు ఎంపికయ్యాడు. కిడాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలకు పద్మ అవార్డులు దక్కాయి. త్వరలో ఎన్నికలు జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ త్రిపుర రాష్ట్రాలకు పద్మ అవార్డులో భారీ వాటా దక్కింది.

Related Posts