నిరంతరం ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయకపోతే తనని ఎక్కడ మరిచిపోతారని అనుకుంటుందో ఏమో కాని టాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పుతున్న శ్రీరెడ్డిని మీడియా పక్కన పెట్టేయడంతో ఇక లాభం లేదనుకుని ఫేస్‌బుల్ లైవ్‌లోకి వచ్చింది. ఇక శ్రీరెడ్డి ఫేస్ బుక్ లైవ్ అంటే నెటిజన్లతో వార్ తప్పనిసరే. ఎప్పటిలాగే లైవ్‌లో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై అంతెత్తున్న లేచింది. వాళ్ల కామెంట్స్‌కు ధీటుగా నోటికి పనిచెబుతూ.. బూతుపురాణం మొదలు పెట్టింది. తనను పొగిడే వాళ్లపై అమితమైన ప్రేమను కురిపిస్తూనే.. తిట్టేవాళ్లను చెడుగుడు ఆడేసింది. ఈ సందర్భంలోనే మహిళలపైనా పలు వివాదాస్పద కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. నా ఉద్యమం ఆగలేదు. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చా.. దైవదర్శనం వల్ల నాలో మరింత పవర్ పెరిగింది. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే.. వారికి లం*** అని ముద్రవేస్తున్నారు. కాల్ గర్ల్ అంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. అయితే బయటకు కనిపించేది మేమే.. ఎంత మంది ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు లేరు. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం కామంతో కళ్లు మూసుకుపోయే మీలాంటి వాళ్లు కాదా? మీరు మాత్రం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు. ఆడవాళ్లు మాత్రం పతీవ్రతల్లేనే ఉండాలి. ఈ రోజుల్లో పతీవ్రతల్ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీ లాంటి ఎదవల వల్లే పతీవ్రతలు అనే వాళ్లు కనుమరుగు అవుతున్నారు. మీరు చూసే కామపు చూపుల వల్లే అమ్మయిలు పతీవ్రతలు కాలేకపోతున్నారు.