విజయవాడ, డిసెంబర్ 28,
ఏపీలో అధికార పార్టీ ఆదాయానికి సంబంధించి ఆసక్తికర అంశాలు బయటికి వచ్చాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే ఆదాయం తగ్గింది. దాదాపు 13 శాతానికి పైగా ఆదాయం తగ్గినట్లుగా తాజాగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఆ నివేదికను స్వయంగా పార్టీలే కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. వైఎస్ఆర్ సీపీ సమర్పించిన నివేదిక ప్రకారం.. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ సీపీకి రూ.93.72 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు అదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే సుమారు 13.21 శాతం తరుగుదల కనిపించినట్లయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టులో ఇంకా ఏమున్నాయంటే.. పార్టీకి 2021లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.96.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ సొమ్ము ఈ సారి రూ.60 కోట్లే వచ్చింది. ఇదే సమయంలో ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి వచ్చిన ఆదాయం అంతకుముందు ఏమీ లేదు. కానీ ఇది ఈ ఏడాది రూ.20 కోట్లకు చేరింది. అన్ని ఖర్చులుపోగా పార్టీకి నికరంగా రూ.92.72 కోట్ల ఆదాయం మిగిలిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంనాటికి ఉన్న రూ.250 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్‌తో కలిపితే 2022 మార్చి 31నాటికి పార్టీ జనరల్ ఫండ్‌కు రూ.343 కోట్లు చేరింది.
31 మార్చి, 2022 31 మార్చి, 2021
సంస్థల నుంచి డొనేషన్లు 2,68,245 30,881
ఎలక్టోరల్ ట్రస్టులు 20,00,00,000 -
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 60,00,00,000 96,25,00,000
ఇతర ఆదాయం 13,69,73,811 11,73,75,137
మొత్తం 93,72,42,056 107,99,06,018
ఖర్చులు 1,00,21,634 80,79,994
నికర ఆదాయం 92,72,20,422 107,18,26,024
ఓపెనింగ్ బ్యాలెన్స్ 250,48,32,920 143,30,06,896
జనరల్ ఫండ్‌లో మొత్తం 343,20,53,342 250,48,32,920
ఆస్తులు
నగదు 183,71,50,360 250,34,45,540
లోన్లు, అడ్వాన్సులు, డిపాజిట్లు 159,48,08,150 18,08,100