YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెన్షన్లు.. నోటీసులు

పెన్షన్లు.. నోటీసులు

విజయవాడ, డిసెంబర్ 31, 
పీలో పెన్షన్లను తొలగిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఇది అధికారులు నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మాత్రమే అర్హులకు పెన్షన్‌ను అందిస్తామని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా కొందరు నిబంధలకు విరుద్దంగా ఉన్నారని అంటున్నారు. వారికి అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహరం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. మెదటి దశలో దాదాపుగా లక్ష మందికిపై నోటీసులు అందాయని అంటున్నారు. అనర్హులుగా గుర్తించిన పెన్షన్‌దారులను సచివాలయ అధికారులు పిలిచి నోటీసులు ఇస్తున్నారు. రెండు కాపీలు ఇచ్చి ఒకటి సంతకం చేసి రిటర్న్ తీసుకుంటున్నారు. మరొకటి పెన్షన్‌దారుడికి అందిస్తున్నారు.నోటీసులు ఇచ్చిన తరువాత సచివాలయ అధికారులు మరి కొన్ని మెలికలు కూడా పెడుతున్నారు. నోటీసులు ఇచ్చినట్లుగా సంతకంతో కూడిన లేఖను లబ్ధిదారుడి నుంచి తీసుకోవటంతోపాటుగా అవసరం అయిన ధృవ పత్రాలను కూడా తీసుకురవాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో లబ్ధిదారుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. తమకు పెన్షన్ రాదేమో అనే అనుమానంతో లబ్ధిదారులు ఆందోళననకు గురవుతున్నారు.ఇదే సమయంలో అధికారులు అడిగిన ధృవ పత్రాలను తీసుకువస్తే పెన్షన్ ఇస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. బాధితులు మాత్రం అధికారుల మాటలను ఎంత వరకు నమ్మాలో తెలియటం లేదని అంటున్నారు.
పెన్షన్ దారులలకు ఇచ్చే ఆర్థిక సహయాన్ని రద్దు చేస్తున్నారంటూ ప్రచారం మొదలవటంతో రాజకీయం కూడా అందులో దూరిపోయింది. ఈ విషయంలపై ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని మండిపడుతున్నాయి. దశల వారీగా పెన్షన్ పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల జాబితాలో కోత విధిస్తుందని ఆరోపిస్తున్నాయి. అనర్హలుగా చిత్రీకరించి పెన్షన్‌లో కొత విధించటంపై అన్ని పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా పెన్షన్‌దారులకు నోటీసులు ఇవ్వటంతో వారు ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఇలాంటి చర్యలు వలన లబ్ధిదారుల్లో భయాందోళనలను రేకెత్తించేందుకు ప్రభుత్వం పరోక్షంగా అధికారులను వాడుకుంటుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీని పై ఆందోళనకు సిద్ధం అవుతామని పార్టీలు హెచ్చరిస్తున్నాయి.

Related Posts