YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కలియుగ వెంకటేశ్వరుడికి కాసుల వరద

కలియుగ వెంకటేశ్వరుడికి కాసుల వరద

తిరుమల, డిసెంబర్ 31, 
కలియుగ వైకుంఠ వాసుడు, తిరుమల వెంకటేశ్వరుడికి 2022 సంవత్సరంలో భారీగా ఆదాయం వచ్చింది. కోట్ల రూపాయలతో హుండీ గలగలలాడింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు రూ.1,320 కోట్లు వచ్చిట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు హుండీ ఆదాయం సైతం అదే స్థాయిలో పెరిగింది. కరోనా ఆంక్షలు ఈ ఏడాది మార్చి నుంచి తొలగించడంతో.. తిరుమలకు భక్తులు పోటెత్తారు.కొత్త సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రానికి భారీగా భక్తులు తరలి రానున్నారు. దీంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి హెచ్చరికలతో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు పలు సూచనలు చేశారు. వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచనున్నారు. సుమారు 8 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అయితే తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించారు. వ్యక్తిగత నియంత్రణ, శానిటైజేషన్ పాటించాలని సూచించారు.

Related Posts