YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వైట్... ఎల్లో మెటల్ పరుగులు

వైట్... ఎల్లో మెటల్ పరుగులు

ముంబై, జనవరి 2, 
ఊహించినట్లుగానే బంగారం ధర బిస్కట్‌ గోల్డ్‌ రేటు తెలుగు రాష్ట్రాల్లో ₹55 వేల మార్క్‌ను దాటింది. చెన్నైలో ₹56 వేలకు చేరువలో ఉంది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 110 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర ₹ 200 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 50,600 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 55,200 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,300 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు
విజయవాడలో ‍10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 50,600 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 55,200 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,300 కు చేరింది. విశాఖపట్నం  మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది.
చెన్నైలో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 51,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,960 కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 50,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,200 కి చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,600 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,200 గా ఉంది.
మైసూరులో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,600 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,200 గా ఉంది.
పుణెలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 50,600 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 55,200 గా ఉంది.
ప్లాటినం ధర
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 1,090 పెరిగి ₹ 28,000 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Related Posts