YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంగవీటి చుట్టూ బెజవాడ రాజకీయాలు

వంగవీటి చుట్టూ బెజవాడ రాజకీయాలు

విజయవాడ, జనవరి 3, 
బెజవాడ రాజకీయాలు…వంగవీటి రంగా చుట్టూ తిరుగుతున్నాయ్. ఆ ఘటన జరిగి మూడు దశాబ్దాలు గడిచినా…దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయ్. అవసరాన్ని బట్టి రంగా అంశాన్ని బయటికి తీసి…ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఇటీవల రంగా హత్యోదంతంపై ప్రత్యర్థులు…దేవినేని నెహ్రూను టార్గెట్‌ చేశారు. దీనిపై ఆయన తనయుడు దేవినేని అవినాష్‌…తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో దేవినేని కుటుంబాన్ని విలన్లుగా చూపుతూ రాసే కథనాలు.. చేసే కామెంట్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనేది ఈ హెచ్చరికల ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు.తనకు సంబంధం లేకపోయినా…నాడు జరిగిన రాజకీయం ఇప్పటికీ వెంటాడడాన్ని అవినాష్‌ భరించలేకపోతున్నారట. ఎక్కడ పోటీ చేసినా…ఏ స్థానం నుంచి పోటీ చేసినా.. తనకు ఉన్న ప్లస్‌లను రంగా హత్యోదంతం డామినేట్‌ చేస్తూనే ఉందని అంటున్నారట. గత ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ తరపున పోటీ చేసినపుడు…కొడాలి నాని ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. నాడు రంగా హత్య.. దేవినేని కుటుంబం అనే ప్రస్తావన తీసుకురావడం వల్లే అవినాష్‌కు మైనస్‌ అయిందని ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందేమోననే ఆందోళన అవినాష్‌ అనుచరుల్లో వ్యక్తమవుతోంది. ఇదంతా ఓ ఎత్తైతే.. రంగా హత్యతో తన తండ్రికి ప్రమేయం లేదని.. ఈ విషయాన్ని కోర్టులే స్వయంగా చెప్పాయని స్పష్టం చేస్తున్నారట. మరోసారి ఈ ఎపిసోడ్‌లో తన తండ్రి ప్రస్తావన తెస్తే.. పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు అవినాష్‌.రంగా హత్య జరిగి 34 ఏళ్లు అయింది.. దేవినేని అవినాష్‌ రాజకీయాల్లోకి వచ్చి సుమారు 15 ఏళ్లు అయింది. గతంలో దేవినేని నెహ్రూ కానీ.. అవినాష్‌ కానీ ఈ తరహా కామెంట్‌ చేయలేదు. అవినాష్‌ ఇప్పుడు ఈ కామెంట్‌ చేయడం వెనుక కారణాలేంటీ..? పైకి బోండా ఉమకు కౌంటర్‌ ఇచ్చినట్టు కన్పిస్తోన్నా.. ఈ వ్యవహరానికి వీలైనంత వరకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనేది అవినాష్‌ ఉద్దేశం. ప్రతేడాది రెండుసార్లు అంటే రంగా జయంతి.. వర్ధంతి సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా.. అన్ని పార్టీల నేతలు దేవినేని కుటుంబాన్ని విమర్శిస్తారు. ఇది భరించలేకపోవడం వల్లే దేవినేని అవినాష్‌ కోర్టులు.. కేసులు అంటూ హెచ్చరికలు చేశారనేది ఓ చర్చ. దీంతో ఆ వివాదం నుంచి వీలైనంత త్వరగా బయటపడేలా దేవినేని అవినాష్‌ ఆలోచన చేస్తున్నారనే చర్చ బెజవాడ రాజకీయాల్లో జరుగుతోందిఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు…అన్ని పార్టీలకు అవసరం. రంగా హత్యోదంతాన్ని తెర మీదకు మళ్లీ బలంగా వస్తే.. కాపు సామాజిక ఓటర్లపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం దేవినేని అవినాష్‌ వైసీపీలో ఉన్నారు. సీఎం జగన్‌ కూడా అవినాష్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేవినేని అవినాష్‌ పార్టీలో ఉండడాన్ని.. అవినాష్‌కు ప్రాధాన్యతను ఇవ్వడాన్ని ప్రత్యర్థి పార్టీలు తప్పు పడుతున్నాయి. ఇది వ్యక్తిగతంగా అవినాష్‌కే కాకుండా.. వైసీపీకి కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. దేవినేని నెహ్రూకు సంబంధం లేదని.. ఆనాటి ప్రభుత్వమే రంగాను హత్య చేయించిందన్నారు కొడాలి నాని. ఇప్పుడు అదే తరహాలో అవినాష్‌ కామెంట్‌ చేయడం చూస్తుంటే.. పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే…ఈ కామెంట్స్‌ చేశారనే చర్చ జరుగుతోంది. గతంలో తాము టీడీపీలో ఉన్నప్పుడు కానీ.. ఆనాడు వంగవీటి రాధా టీడీపీలో చేరినపుడు రంగా హత్య గురించి అవినాష్‌ ఈ తరహా కామెంట్ చేయలేదని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో తీసుకురాని ఈ ప్రస్తావన…ఇప్పుడు పార్టీ అధినాయకత్వం ఆదేశాలేననే చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహరానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం అవినాష్‌ చేస్తున్నప్పటికీ.. ఇది ఇక్కడితో ఆగుతుందా..? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

Related Posts