YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కోసమే కేసీఆర్ వ్యూహామా

జగన్ కోసమే కేసీఆర్ వ్యూహామా

విజయవాడ, జనవరి 3, 
రాష్ట్ర విభజన సమస్యల వల్ల కావచ్చు. బీజేపీకి జగన్ పరోక్షంగా జగన్ మద్దతిస్తున్నాడని కావచ్చు. ఇద్దరి మధ్య పొసగడం లేదన్న వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తెలంగాణపై అనేక అంశాల్లో సుప్రీంకోర్టును కూడా జగన్ ప్రభుత్వం ఆశ్రయించింది. తిరిగి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే తాము స్వాగతిస్తామని ఆ పార్టీ ప్రకటించడంతో ఇద్దరికీ చెడిందనే భావన అందరిలోనూ ఉంది. ఇటు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులు కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఇద్దరికి ఇటీవల కాలంలో పొసగడం లేదన్న వార్తలు పొలిటికల్ కారిడార్స్ లో వినపడుతున్నాయి. జగన్ ఏపీలో గెలిచిన వెంటనే ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వెళ్లి ఆశీర్వదించి వచ్చారు. తర్వాత అనేక సార్లు జగన్ ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ ను కలిశారు. ఇద్దరి మధ్య రెండు రాష్ట్రాల సమస్యలు చర్చకు వచ్చాయి. అయితే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ కు ఆగ్రహం కలిగించిందనే వారు కూడా లేకపోలేదు. కాకుంటే షర్మిల పార్టీ వల్ల కేసీఆర్ కు లాభమేనన్న వాదన కూడా ఉంది. షర్మిల అరెస్ట్ కూడా ఇద్దరి మధ్య మరింత దూరం పెంచిందంటారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఏపీకి వస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వల్ల జగన్ కు లాభమేనన్నది విశ్లేషకుల అంచనా. పొలిటికల్ క్విడ్ ప్రోకోకు బీజం పడిందంటున్నారు. జనసేన, టీడీపీ నేతల టార్గెట్ గానే కేసీఆర్ అడుగులు ఉంటాయన్నది చేరికలను బట్టి తెలుస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు పదవి ఇవ్వడమూ కాపుల ఓట్లలో చీలిక తేవడం కోసమేనని అంటున్నారు. ఆయన వల్ల ఓట్లు చీలుతాయా? అన్న సందేహాన్ని పక్కన పెడితే.. టీడీపీ, జనసేనలను మాత్రమే కేసీఆర్ భవిష్యత్ లో టార్గెట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు చేరుతున్న నేతలు కూడా ఆ పార్టీకి చెందిన నేతలే కావడం గమనార్హం. అయితే కేసీఆర్ పార్టీని ఏపీలో ఎంతమంది నమ్ముతారు? ఎందరు ఓట్లేస్తారు? అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ తో ఎవరూ పొత్తు పెట్టుకునే పని చేయరు. ఒంటరిగా పోటీ చేసి ఆయన పార్టీ చీల్చే కొద్దోగొప్పో ఓట్లు టీడీపీకి, జనసేనకు గండిపడే విధంగానే కేసీఆర్ వ్యూహం ఉండనుందని తెలుస్తోంది. ఏపీలో కొందరు కేసీఆర్ అభిమానులున్నారని వారి ఓట్లు ఎంత వరకు సాధిస్తారన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Related Posts