YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కన్నాకు ఆదరణ... వీర్రాజు కినుక?

కన్నాకు ఆదరణ... వీర్రాజు కినుక?

కాకినాడ  జనవరి7 
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. కన్నా తర్వాత ఆ పదవి సోము వీర్రాజుకి లభించింది. పార్టీలో ఇద్దరు ఎడ్డెం అంటే తెడ్డెం అనుకునే పరిస్థితి. వారం కిందట ఫ్యామిలీతో కలిసి కాకినాడ జిల్లాకు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ. దైవ దర్శనం చేసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కన్నా పర్యటనలో బాగానే ఇన్వాల్వ్ అయిపోయారట జిల్లా బిజెపి నేతలు. గౌరవ మర్యాదలు ఇస్తు మాజీ అధ్యక్షుడికి స్వాగతం చెప్పారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సోము వీర్రాజు నిప్పులపై ఉన్నట్టు సమాచారం. ఇందుకు కారణాలు లేకపోలేదట. రెండు నెలల క్రితం వీర్రాజును ఉద్దేశించి కన్నా చేసిన వ్యాఖ్యలేనని చెబుతున్నారు. సోము వీర్రాజు వల్లే పార్టీ ఎదగడం లేదని.. మిత్రపక్షం జనసేనను సరిగా డీల్‌ చేయడం లేదని కన్నా ఆరోపించారు. ఆ వ్యవహారంపై సోము వీర్రాజు స్పందించలేదు. అంతా బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందని.. ఏం చేయాలో తనకు తెలుసని సమాధానం దాటవేశారు.నెల క్రితం జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లి కన్నాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంపై రెండు పార్టీల్లోనూ చర్చ సాగింది. నాదెండ్ల కన్నాను ఎందుకు కలిశారో బయటకు రాలేదు. ఆ భేటీపై కన్నా పార్టీ పెద్దలకు చెప్పారో లేదో తెలియదు. ఇంతలో కన్నా కాకినాడ జిల్లా పర్యటన తెరమీదకు వచ్చింది. రెండు రోజుల కిందట కాకినాడ జిల్లా బిజెపి పదాధికారుల సమావేశం జగ్గంపేటలో జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న వీర్రాజు.. కన్నా పర్యటనలో జిల్లా లీడర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని సీరియస్ అయ్యారట. ప్రైవేట్ కార్యక్రమంలో ఆ స్థాయిలో శృతి కలపడం అవసరమా అని గట్టిగానే కౌంటర్ ఇచ్చారట వీర్రాజు. ఒకవేళ మీకు గాని, కన్నాకు గాని బీజేపీపై అంత ప్రేమ ఉంటే ఒక పార్టీ కార్యక్రమం లేదా ప్రెస్‌మీట్ పెట్టించొచ్చు కదా అని చెప్పారట.జిల్లా నేతలు ఒకరిద్దరు వీర్రాజుకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారట. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హోదాలో కన్నాను గౌరవించామని.. తమకు ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని అన్నారట. దాంతో వీర్రాజు మరింత రుసరసలాడినట్టు తెలుస్తోంది. మీరు చిన్నపిల్లలు కాదు. ‘పార్టీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఏం తెలియనట్టు కథలు చెప్పొద్దు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారట వీర్రాజు. అక్కడితో ఊరుకుంటే పర్వాలేదు. ‘కన్నా పార్టీలో ఉంటారు లేదో.. మీకు తెలియదా’ అని వీర్రాజు ఎదురు ప్రశ్నించారట. ‘ఎవరి అజెండా ఏంటో అర్థం అవుతుంది కదా’ అని కస్సు బుస్సు లాడారట. కన్నా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లాలో పదవులు చేపట్టిన నేతలు బీజేపీలో ఉంటారా పోతారా అని వీర్రాజు ఆరా తీశారట. పైగా రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్టు తన సొంత ఉమ్మడి జిల్లాలోనే ఇలా జరిగిందేంటా అని అగ్గి మీద గుగ్గిలం అయ్యారట వీర్రాజు. పిక్చర్ క్లియర్‌గా కనిపిస్తున్నా.. గీత దాటి ఎందుకు ప్రవర్తించారు? కన్నాతో అంత రాసుకు పూసుకుని తిరగడం అవసరమా? అని వీర్రాజు ప్రశ్నించినట్టు టాక్ నడుస్తుంది. ఎవరైనా పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలని.. పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెగేసి చెప్పేశారట వీర్రాజు.మొత్తానికి సొంత జిల్లాలో కన్నాకు ఇచ్చిన ఆతిథ్యంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిందట సోము వీర్రాజు పరిస్థితి. ఇప్పటివరకు ఓపిక పట్టిన ఆయన ఒక్కసారిగా ఓపెన్ అయిననట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి మాజీ చీఫ్‌.. ప్రస్తుత చీఫ్‌ మధ్య రాజుకున్న ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related Posts