తిరుమలను వివాదాస్పదం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసనగా బ్రాహ్మణ ఐక్య వేదిక బుధవారం శాంతియాత్ర నిర్వహించింది. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర కొనసాగింది. తరువాత వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గంపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. అర్చక వృత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రమణదీక్షితుల విషయంలో ప్రభుత్వం వైఖరి దారుణం. ఏడుకొండల స్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వ నిర్ణయాలు వున్నాయపి అన్నారు. రాష్ట్రంలో హిందూధర్మంపై చంద్రబాబు సర్కార్ దాడికి దిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తామని వేదిక ప్రతినిధులు అన్నారు.