క్వాలిటీ సర్టిఫికేట్ లేకుండా భారత్‌లో బొమ్మలు విక్రయిస్తున్న 160 చైనా కంపెనీలకు షాకిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం డేటాను విడుదల చేసింది. భారతదేశంలో బొమ్మలు విక్రయించడానికి సుమారు 160 చైనా కంపెనీలకు ఇంకా తప్పనిసరి నాణ్యత ధృవీకరణ పత్రాన్ని జారీ చేయలేద, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆలస్యం జరిగిందని పేర్కొంది. జనవరి 2021 నుండి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుండి ISI నాణ్యతా ధృవీకరణ గుర్తును పొందడం కోసం దేశంలో బొమ్మల విక్రయానికి భారతదేశం తప్పనిసరి చేసింది.గత రెండేళ్లలో దాదాపు 160 చైనా బొమ్మల కంపెనీలు బీఐఎస్ క్వాలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా వాటిని ఇంకా విడుదల చేయలేదని తెలిపారు.సాధారణంగా బీఐఎస్ క్వాలిటీ సర్టిఫికేట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసిన తర్వాత జారీ చేస్తారు. మహమ్మారి ఆంక్షలు, ఆరోగ్య సమస్యల కారణంగా బిఐఎస్ అధికారులు చైనాను సందర్శించలేకపోయారని ఆయన అన్నారు. అలాగే మమ్మల్ని తనిఖీకి ఆహ్వానించలేదని, కరోనా వైరస్ కారణంగా మేము చైనాకు వెళ్లలేమని తివారీ చెప్పారు. గత రెండేళ్లలో బీఐఎస్ 29 విదేశీ బొమ్మల తయారీదారులకు నాణ్యతా ధృవీకరణ పత్రాలను అందించిందని, అందులో 14 మంది వియత్నాంకు చెందినవారని తివారీ చెప్పారు.ఇదే కాలంలో బిఐఎస్ 982 భారతీయ బొమ్మల తయారీదారులకు నాణ్యతా ధృవీకరణ పత్రాలను కూడా జారీ చేసిందని ఆయన చెప్పారు. టాయ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌లను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో బిఐఎస్ గత కొన్ని రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహిస్తోంది. దేశంలో ‘మేడ్ ఇన్ చైనా’ బొమ్మల విక్రయం చట్టవిరుద్ధమని వినియోగదారులు గుర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చని తివారీ చెప్పారు.అయితే బొమ్మల నాణ్యత నియంత్రణ ఆదేశాలను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో గత కొద్ది రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహిస్తోంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న బొమ్మల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నామని, బీఐఎస్ నాణ్యత మార్కెట్ లేకుండా దిగుమతి చేసుకున్న బొమ్మలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల బొమ్మలు విక్రయించడానికి నకిలీ బిఐఎస్ లైసెన్స్‌లను ఉపయోగించారని తివారీ తెలిపారు. బీఐఎస్ ఒక నెల మొత్తం దాడులు నిర్వహించాలని యోచిస్తోంది.దేశంలో అక్రమంగా విక్రయిస్తున్న ‘మేడ్ ఇన్ చైనా’ బొమ్మలు కనిపిస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని తివారీ చెప్పారు. బీఐఎస్ 76వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, తమ అభివృద్ధి ప్రారంభ దశలో నాణ్యతను అనుసరించిన దేశాలు మెరుగ్గా, వేగంగా అభివృద్ధి చెందాయని అన్నారు.దేశవ్యాప్తంగా బీఐఎస్ క్వాలిటీ కనెక్ట్ కార్యక్రమాల ద్వారా నాణ్యత గురించి మరింత అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నంలో పదవీ విరమణ చేసిన సాంకేతిక నిపుణులను కూడా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.