YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గాన గాంధర్వుడు యేసుదాసు - రెపు ఆయన జన్మదినం

గాన గాంధర్వుడు యేసుదాసు - రెపు ఆయన జన్మదినం

కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్  1940 జనవరి 10న కేరళ లోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు, రంగస్థన నటుడు. అతనికి నటునిగా, భాగవతార్ గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు. యేసుదాసు తన ఐదుగురు పిల్లలలో పెద్దవాడు, అతని తరువాత ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. కె జె ఏసుదాసు భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు. అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు. అతను 1970, 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు. రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అతను 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను కూడా అందుకున్నాడు. అతను ఐదు దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నాడు. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడాడు. దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బంలు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు. స్వామివారి పవళింపు సేవ వేళ పాడే ‘హరివరాసనం’ పాట ఎంతో గుర్తింపు పొందింది.

Related Posts