నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసుదనా చారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కాగా ఇక్కడ ప్రసంగం ముగియగానే బేగంపేట ఎయిర్‌పోర్టునుంచి నేరుగా విజయవాడకు పయనమై ఏపీ ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో గవర్నర్ పాల్గొననున్నారు.