కాకినాడ
కాకినాడ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంప్రదాయ సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయాన్ని ప్రతిబింబించే సంప్రదాయ 'సంక్రాంతి' సంబరాలను ప్రజలు అందరు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, యువతకు సంప్రదాయ క్రీడల పట్ల ఆసక్తి కలిగించే లాగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలలో సంప్రదాయ 'సంక్రాంతి' సంబరాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా జిల్లా పోలీసులు పకడ్భందిగా చర్యలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగా కోడి పందాలు, ఇతర జూదాలలో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి వారిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని అధికరణల ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ల వద్ద బైండ్ ఓవర్ చేసారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 296 బైండోవర్ కేసులు నమోదు చేసి, 850 మందిని బైండోవర్ చేసి వారి వద్ద నుండి 1,346 కోడి కత్తులు స్వాధీనం చేసుకోని వారిపై కేసులు నమోదు చేసారు. . ఇప్పటివరకు జూదాలు కోడిపందాలు పై 51 కేసులు నమోదు చేసి, 263 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.9,96,122- లను స్వాధీనం చేసుకున్నారు.