జయవాడ
తెలుగింటి పండుగ సంక్రాంతి. లోగిళ్లలో ఆడపిల్లలు వేసే ముగ్గులు... వాటిపై అందంగా అలంకరించబడిన గొబ్బిళ్లు... హరిదాసుల కీర్తనలు... కుర్రకారును రంజిపజేసే కోడిపందాలు, గాలిపటాలు... ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు. సంప్రదాయ వైభవానికి ప్రతీకలన్నట్లుగా ప్రతి ఇంటా సంబరాలు జరుగుతుంటాయి. ఆధునికత పేరిట ఆశలు అంతరిక్షంలో ఉన్నా, మనవైన మూలాలను గుర్తుచేసే సంక్రాంతి వస్తుందంటే సంబరాలు పండుగకు ముందుగానే ప్రారంభమైపోతుంటాయి. అచ్చ తెలుగు పల్లెల్లో కనిపించే ఈ పండుగ వైభవాన్ని సిటీజనులకు రుచి చూపడానికి స్టార్ మా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్‌ను కండిపాడు, విజయవాడలో నిర్వహించింది. శుక్రవారం ఉదయం విజయవాడలోని బొమ్మదేవర బాబూరావు ఎస్టేట్, బ్యాంకు కాలనీ ఎదురుగా, కంకిపాడు వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో త్వరలో స్టార్‌మా లో ప్రసారం కానున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ తారాగణం సందడి చేసింది.విజయవాడ వాసులతో పూర్తిగా మమేకమైన ‘బ్రహ్మముడి’ తారాగణం, వారితో కలిసి రంగవల్లులు వేశారు. గాలి పటాలను ఎగురవేయడమే కాదు, పండుగకు ముందుగానే సంక్రాంతి లక్ష్మి శోభను నగరానికి తీసుకువచ్చారు.బిగ్‌బాస్, కోయిలమ్మ ఫేమ్ మానస్, దీపిక రంగరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ హమీదా కూడా ఓ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సీరియల్ జనవరి24వ తేదీ నుంచి ప్రతి రోజూ 7.30 గంటలకు సోమవారం నుంచి శనివారం వరకూ ప్రసారం కానుంది. ఈ సందర్బంగా వర్ధమాన నటుడు శ్రీకర్ మాట్లాడుతూ సంపన్నులైన దుగ్గిరాల కుటుంబానికి ముగ్గురు వారసులు. పెద్దవాడు రాజ్యవర్థన్. తాను చేసే పని ఏదైనా సరే ఓ స్టేటస్ ఉండటం మాత్రమే కాదు, పర్‌ఫెక్ట్‌గా చేయాలని కోరుకుంటాడు. కానీ అతనికి తాను చేసుకునే అమ్మాయి మంచి ముత్యం లాంటిది కావాలనేది కోరిక. రెండోవాడు రాహుల్. ప్లేబాయ్ . మూడోవాడు కళ్యాణ్. కవితాలోకంలో విహరిస్తుంటాడు. ఈ కుటుంబానికి తన కూతుళ్లను కోడళ్లుగా చేయాలని తలిచే ఓ మధ్యతరగతి తల్లి ప్రయత్నాలు, ఆ క్రమంలో చోటు చేసుకునే సంఘటనల సమాహారం ‘బ్రహ్మముడి’. ఉత్కంఠత రేపే కథనం, భావోద్వేగాలను తట్టి లేపే సంభాషణలతో ఈ సీరియల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.