YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాకినాడలో కల్తీ మాఫియా

కాకినాడలో కల్తీ మాఫియా

కాకినాడ, జనవరి 18, 
కాకినాడ జిల్లాలో కల్తీ ఆయిల్ మాఫియా బయటపడింది..ఏళ్ల తరబడి గోవులు ను వధించి దందా చేస్తున్నారు..గుట్టు చప్పుడు కాకుండా తండ్రి కొడుకులు సొమ్ము లు కోసం కక్కుర్తి పనులు చేస్తున్నారు..పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని రామకృష్ణ నగర్ లో ఆవులు ను చంపి వాటి కొవ్వు నుంచి ఆయిల్ ను చేస్తున్నారు.తండ్రి కొడుకులు ఎం డీ షంషిర్, ఎం డీ అరిఫ్ ఈ దారుణానికి పాల్పడుతున్నారు..ఆవులను బల్క్ గా కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు…ఈ ఆయిల్ ను గౌహతి, వెస్ట్ బెంగాల్, బెంగుళూరు, చెన్నై సరఫరా చేస్తున్నట్లు వెల్లడి అయింది… దానికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.. మామూలుగా ఆవులను చంపాలంటే, మాంసం క్రయవిక్రయాలు చేయాలంటే సర్టిఫికెట్స్ ఉండాలి.. డేంజర్ అండ్ ఎఫిషియన్సీ లైసెన్స్ కలిగి ఉండాలి.. కానీ ఆ విషయంలో కూడా తండ్రి కొడుకులు అడ్డగోలుగా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు.. ఆవుల చెవులకి ట్యాగులు కూడా గుర్తించారు అధికారులు.. ఇవి లోన్ లో ఉన్న వాటిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు..నాలుగు బ్రతికి ఉన్న ఆవులు, 40 వరకు ఆవు చర్మాలు, 100 డబ్బాలను గుర్తించారు.. యానిమల్ యాక్ట్ 1977 ప్రకారం పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు… కొవ్వును సేకరించి వాటిద్వారా ఆయిల్ తయారు చేస్తున్నారు. కళేబరాలను బీప్ సెంటర్లకు ఇస్తున్నారు… వీరి వెనకాల పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. రాజమండ్రి కేంద్రం గా దందా కొనసాగుతుంది ట్రాన్స్పోర్ట్ సేల్స్ వ్యవహారాలు చూసేవాళ్ళు కూడా ఉంటారు… చుట్టూ జనం ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారు.. ఒక మినీ ఆపరేషన్ థియేటర్ లా గోవులను చంపడం కళేబరాలను వేరు చేయడం కొవ్వు సేకరించడం జరుగుతుంది. వాటి ద్వారా లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారు.యానిమల్ రెస్క్యూ టీంకి సమాచారం అందింది. వారి ద్వారా పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. పోలీసులకు సమాచారం ఇచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ఈ దందాకు చెక్ పెట్టారు. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం నడిచినట్లుగా గుర్తించారు.. కళేబరాలు పాడవకుండా ప్రత్యేకమైన సాల్ట్ ను కూడా ఉంచారు. .బస్తాలు కొద్దీ ఆ ఉప్పు స్టోరేజ్ ఉంది. బ్రాండెడ్ ఆయిల్ డబ్బాలలో నూనె నిలువ ఉంది… చుట్టు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.. బయట వారు ఎవరూ లోపలికి రాకుండా పకడ్బందీగా కట్టుదిట్టమైన దందా చేస్తున్నారు నిర్వాహకులు.. వారి వెనకాల ఎవరున్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.. డాల్డా బదులు ఈ ఆయిల్ వాడే అవకాశం కూడా ఉంటుంది.. పెద్దపెద్ద రెస్టారెంట్లు హోటల్స్ కి సరఫరా అవుతుందనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతోంది. అసలు ఎన్ని ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుంది అని కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.. కళేబరాలు వ్యర్ధాలను యథేచ్చగా మున్సిపల్ డ్రైనేజీ లో కలిపేస్తున్నారు.. దాని వలన చుట్టుపక్కల వల్ల వారు అనారోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.ఎగుమతులకు సంబంధించి వారి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు… వందల డబ్బాలలో ఈ కొవ్వు నిల్వ ఉంది.. ఆవుల నుంచి కొవ్వు సేకరించి వాటిని మరిగించి దీనిని తయారు చేస్తున్నారు.. దానికోసం పెద్ద వ్యవస్థ ను మైంటైన్ చేస్తున్నారు.. ఒకరిద్దరి వల్ల ఈ తతంగం నడిచే అవకాశం లేదు.. వెనకాల ఉన్న సూత్రధారులు ను కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇన్ని సంవత్సరాల తరబడి ఈ వ్యవహారం నడుస్తున్న చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు స్పందించలేదు అని కూడా ఆరా తీస్తున్నారు...ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం దీనిని పూర్తిగా ఆయిల్ గా నిర్ధారించలేమని అంటున్నారు.. శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయనున్నారు.. ప్రాథమికంగా మాత్రం సోప్స్ లో ఉపయోగించడానికి ఈ కొవ్వును ఉపయోగిస్తారని చెప్తున్నారు… కాస్మోటిక్స్, మేకప్ మెటీరియల్ లో దీనిని ఉపయోగిస్తారని అంటున్నారు… బిర్యానీ వంటి ఐటమ్స్ లో ఆవును కోసిన 24 గంటల్లోపు టేస్ట్ కోసం డాల్డా ప్లేస్ లో వాడే అవకాశం ఉందని చెప్తున్నారు.. లోపల విపరీతమైన స్మెల్ వస్తుంది.. ఏళ్ల తరబడి ఇంత తతంగం నడుస్తున్న మున్సిపల్ అధికారులకు కనీసం సమాచారం లేదు.. గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా కొనసాగుతూనే ఉంది..లోకల్ గా ఏమైనా హోటల్స్ కి సరఫరా చేశారా అనే వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు… ఓపెన్ గా జనావాసాలు తిరిగే ఏరియాలలో కథ నడిపించేస్తున్నారు… ఆవుల కొనుగోళ్లు, వాటి ని చంపడం పై క్లారిటీ రావాల్సి ఉంది.. ఎక్కడి నుంచి తరలిస్తారు.. వందల సంఖ్యలో ఆవులు తరలింపు కూడా మిస్టరీ గా మారింది… ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం దాదాపు ఏడాదిగా ఎటువంటి రవాణా జరగలేదని చెప్తుంటే ఫ్రెష్ గా చంపిన ఆవులు కళేబరాలు అక్కడే ఉన్నాయి.. వాటిని ఎందుకు వధించారో తేలాలి.. ఇతర రాష్ట్రాలలో ఏ ఏ కంపెనీలకు ఏ విధంగా తరలిస్తున్నారు అని దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా వీరీ వెనుక ఉన్న నెట్వర్క్ కోసం విచారణ జరుగుతుంది.. ఏళ్ల తరబడి కల్తీ నూనె తయారు అవుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

Related Posts