YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి వేళ... తెగ త్రాగేశారు

సంక్రాంతి వేళ... తెగ త్రాగేశారు

విజయవాడ, జనవరి 18, 
ఆంధ్రప్రదేశ్ లో దశల వారీ మద్య నిషేధం ఒక మిధ్య. గత ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తరువాత దశల వారీ మద్య నిషేధం అంటూ ఏపీలో సరి కొత్త మద్యం విధానాన్ని ప్రవేశ పెట్టారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా ఆ కొత్త విధానాన్ని రూపకల్పన చేసిన జగన్ సర్కార్.. ఇక అక్కడ నుంచీ దశల వారీగా మద్యం అమ్మకాల పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దేశంలో ఎక్కడా కనబడిన బ్రాండ్ లను ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  విక్రయిస్తోంది. ధరలను విపరీతంగా పెంచేసింది. దశలవారీ మద్య నిషేధం అన్న వాగ్దానాన్ని ఆరు నిలువుల గోతిలో పాతేసి రోజు రోజుకూ మద్యం విక్రమాయలను పెంచేస్తోంది. అలు మద్యం అలవాటు మాన్పించడానికి ధరలు పెంచామని చెప్పుకున్న సర్కార్.. మందు బాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడమే కాకుండా నాసిరకం బ్రాండ్లతో వారి ఆరోగ్యాలనూ గుల్ల చేస్తోంది. తాజాగా సంక్రాంతి వేళ ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.   ఈ సంక్రాంతి వేళ రాష్ట్ర సర్కార్ కు మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వచ్చాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రోజుల్లో రోజుల్లో ఏకంగా రూ.314 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2 .33 లక్షలకుపైగా లిక్కర్, 83 వేలకుపైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.27.81 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అసలు ఏపీలో  జగన్ ఎన్నికల సమయంలో మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి మ‌హిళా ఓట్లు దండుకుని ఇప్పుడు ఆ వాగ్దానాన్ని విస్మరించి మద్యపానాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానం అన్నట్లుగా ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది.  మ‌ద్య నిషేధం అమ‌లు చేయ‌క‌పోవటంపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వ్వ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం.. మ‌ద్యం రేట్లు పెంచింది. మ‌ద్యం ధ‌ర‌లు పెంచ‌డం ద్వారా మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతూ వస్తోంది.  మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గ‌డం అటుంచితే.. మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కు చెందిన మందుబాబుల జేబులు గుల్ల‌వుతున్నాయి. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడింది.  తప్పం, మడమ తిప్పం అని చెప్పుకొనే జగన్ ఆదాయం కోసం మద్య నిషేధం సంగతి అటుంచి మద్యపాన ప్రోత్సాహం అనే విధానం అమలు చేస్తున్నారనిపించక మానదు.  ఇప్పటికే వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసిన జగన్ మద్యం ధరలు పెంచి మద్యపానం అలవాటును తగ్గిస్తానని చెప్పడం తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్న సామెతను గుర్తుకు తెస్తోంది.

Related Posts