YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇదేమి స్నేహం... ఇదేమి బంధం

ఇదేమి స్నేహం... ఇదేమి బంధం

విజయవాడ, జనవరి 18, 
బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కథ కుడా అలాగే సాగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి మూడేళ్ళు దాటింది. కానీ, ఇంతవరకు కలిసి కూర్చున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఉమ్మడి పోరాటాలు, ఆందోళనలు అసలే లేవు. నిజానికి, గడచిన మూడేళ్ళ పై చిలుకు కాలంలో  బీజేపీ, జనసేన నాయకులు ఏ స్థాయిలోనూ ఒక్కటంటే ఒక్క ఉమ్మడి కార్యక్రమం నిర్వహించ లేదు. చివరకు, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలోనూ, రెండు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయలేదు. కార్యకర్తల మధ్య సయోధ్య  కనిపించలేదు. మరోవంక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా  సహా ఇతర బీజేపీ జాతీయ నాయకులు ఏపీకి  వచ్చి పోతున్నా, మిత్ర పక్షం జనసేన నాయకులను కలిసింది లేదు, వారితో మాట్లాడింది లేదు.కొద్ది నెలల క్రితం బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో జనసేన  నాయకులు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలనికోరారు. ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. అయినా  నడ్డా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా ప్రకటించకపోవడమే కాదు, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి గంటకు పైగా చేసిన ప్రసంగంలో కనీసం పవన్ కళ్యాణ్ పేరైనా ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్  ఎప్పుడో సంవత్సరం  క్రితమో ఏమో రోడ్ మ్యాప్ అడిగారు. బీజేపీ స్పందించలేదు. మరోవంక జనసేన ఎక్కడా బీజేపీని మిత్ర పక్షంగా గుర్తించిన దాఖాలు లేవు. కేవలం టీవీ చర్చల్లో చెప్పుకోవడమే కానీ, క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేసింది లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు.  బీజేపీ అగ్ర నేతల మనసులో ఏముందో ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియదు. మరో వంక ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. నాయకులు లేరు. ఉన్న గుప్పెడు మంది నాయకుల మధ్య సయోధ్య లేదు. కొందరు వైసీపీ కొమ్ముకాస్తే మరి కొందరు టీడీపీ కొమ్ము కాస్తారు. అందుకే, పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు ఇక చాలను కున్నారో, ఏమో కానీ, టీడీపీతో కలిసి వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రెండవసారి స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ రెండున్నర గంటల పాటు వన్ టూ వన్ భేటీ జరిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పోరాటం చేస్తామని మీడియా ఎదుట ప్రకటించారు. చాలా స్పష్టంగా వైసీపీని ఓడించే లక్ష్యంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పారు. నిజానికి ఏపీలో ఓటంటూ ఉందంటే, వైసీపీ, టీడీపీలకు,జనసేన పార్టీలకే వుంది. మిగిలిన పార్టీలకు ఒకటి రెండు శాతం ఓటు కూడాలేదు. సో, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చుస్తానని చెప్పడం టీడీపీతో పొత్తుకు సిద్దమని ప్రకటించడంతో సమానమని వేరే చెప్పనక్కర లేదు. ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం పవన్ మా మిత్రుడే అంటోంది. పైగా జస్ట్ అలా పవన్ వెళ్ళి చంద్రబాబుని కలిశారంతే అని చెబుతోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అయితే బీజేపీ జనసేన బంధం కొనసాగుతుంది అని నమ్మ బలుకుతున్నారు.ఏపీలో మా రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంది అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు కలిశారు అంటే కలవడంలో తప్పు లేదు కదా అంటున్నారు. రెండు పార్టీల మధ్య అవగాహన కావచ్చు అని కొత్త బంధాన్ని తెర మీదకు తెచ్చారు. నిజమే, బీజేపీ రాష్ట్ర నాయకులకు కేంద్ర నాయకత్వం మనసులో ఏముందో తెలియదు. అందుకే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇలా ... తలాతోకా  లేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. మరో వంక జనసేన  బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts