YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతి నాలుగు బస్సుల్లో ఒకటి డొక్కుదే

ప్రతి నాలుగు బస్సుల్లో ఒకటి డొక్కుదే

ఆర్‌టిసి బస్సుల నిర్వాహణ లోపం వారి పాలిట శాపంగా మారింది. సిటీలో ఇటీవల కాలంలో పెరిగిన బ్రేక్ డౌన్‌లు కారణంగా వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు ఇటుంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. సకాలంలో బస్సులు రాక, ఒక వేళ వచ్చినా ఎక్కడో ఒక్కడ ఒక చోట చెడి పోవడం వల్ల గంటల తరబడి బరో బస్సు కోసం రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. గ్రేటర్‌లో ఆర్‌టిసిలో 1000కి పైగా ఉన్న డొక్కు బస్సుల కారణంగా నెలకొన్న పరిస్థితి ఇది. సాంకేతిక వైఫల్యాలు, విడిభాగాల కొరత బస్సుల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్షం ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. బస్సుల బ్రేక్‌డౌన్ కారణం నగరంలో ట్రాఫిక్ ఎక్కడిక్కడే స్థంభించిపోతుంది. దీంతో బస్సుల్లో ప్రయాణించే వారే కాకుండా వ్యక్తిగత వాహనాల వెళ్ళే వారు కూడా తాము అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఎనిమిది ఫీట్ల వెడల్పు, 20 ఫీట్ల పొడవు ఉన్న ఒక బస్సు బస్సు అకస్మాత్తుగా రోడ్డుపై నిలిచిపోవడంతో వందలాది వాహనాల స్పీడ్‌కు బ్రేక్ పడుతోంది. దాంతో వారు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక పోతున్నారు.ఒక వైపు కోట్ల రూపాయల ఖరీదు చేసే ఓల్వో వంటి అధునాత బస్సులను సమకూర్చు కుంటున్న గ్రేటర్ ఆర్‌టిసి ఉన్న బస్సుల నిర్వహణలో మాత్రం విఫలం అవుతోంది. ప్రస్తుతం 29 డిపోల పరిధిలో 3850కి పైగా బస్సులు సిటీలో తిరుగుతున్నాయి. వాటిలో కనీసం 1000కి పైగా కాలం చెల్లినవే. మెట్రోడీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సెమి లో ప్లోర్, నాన్ ఎసీ వంటి బస్సులను కొన్ని మినహయిస్తే వీటిలో ఆర్డినరీ బస్సులే ఎక్కువ శాతం కాలం చెల్లినవే. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కింద గతంలో ప్రవేశ పెట్టిన బస్సులతో పాటు, ఆర్డినరీలకు కూడా విడిభాగాలు లభించకపోవడంతో బ్రేక్ డౌన్‌లు, పెరిగిపోతున్నాయి. గేర్ రాడ్ పని చేయక పోవడం, కమాన్ కట్టలు ఊడిపోవడం, బ్రేక్ షూస్ పని చేయకపోవడం, నట్లు, బోల్టులు ఊడిపోవడం, స్పేర్‌పార్ట్ సకాలంలో అందుబాటులో లేక పోవడం, ఇతర సాంకేతిక పరమైన సమస్యలు, నగరంలో ప్రతి రోజూ ఏదో ప్రాంతంలో ఈ బస్సులు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ప్రతి రోజూ 25 నుంచి 40 బస్సులు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల రద్దీ అధికంగా వుండే వేళల్లో వందలాది ట్రిప్పులు రద్దవుతున్నాయి. సికింద్రాబాద్, బేగంపేట, ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్, కోటి, ఆబిడ్స్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుక్‌నగర్, ఉప్పల్, తార్నాక, హబ్సీగూడ, తదితర రద్దీ ప్రాంతాల్లో బస్సులు బ్రేక్ డౌన్‌లు ఆర్‌టిసికి సవాల్‌గా మారాయి. డిపోలలో ప్రతి రోజూ బస్సులను తనిఖీ చేయాల్సిన మెకానికల్ విభాగంలో కాంట్రాక్టు పని విధానం కారణంగా పనిలో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులను తొలగించుకోక పోవడంతో నగరంలో తరుచూ జరిగే బ్రేక్ డౌన్‌లు అటు ఆర్‌టిసి అధికారుల్లోనూ, ఇటు ప్రయాణికుల్లోనే ఆందోళన కలిగిస్తున్నాయి.

Related Posts