YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సలహాదారుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ

సలహాదారుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ

అమరావతి
సలహాదారుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగంది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై  హైకోర్టు విచారణ జరిపింది. ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలి. రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని ధర్మాసనం  వ్యాఖ్యానించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని వెల్లడించింది. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారినే సలహదారులుగా నియమిస్తున్నామని ఏజీ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు. మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది.

Related Posts