ప్రత్యేక ప్యాకేజీ గురించి లేఖ
పలు ప్రాజెక్టులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి
తీవ్ర జాప్యం జరుగుతోంది
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ప్రత్యేక ప్యాకేజీ, ఈఏపీ కింద రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల గురించి లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈఏపీ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు వెంటనే ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2015-16లో రూ. 2,950 కోట్లు, 2016-17లో రూ. 2,854 కోట్లను విడుదల చేశారని గుర్తు చేశారు.