హైదరాబాద్
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. మాజీ ఎంపీ, ప్రముఖ తెలుగు సినీతార సీనియర్ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగువారి సత్యభామగా జమున మనల్ని మెప్పించిన సంగతి అందరికి తెలిసిందే. వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమెకిప్పుడు 86 ఏళ్లు. జమున 1936 ఆగస్ట్ 30న హంపీలో జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె 1953లో పుట్టిల్లు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. రామారావు, అక్కినేని, జగ్గయ్య శోభన్బాబు, కృష్ణలాంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టర్. దాదాపు 198 సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో కుడా జమున నటించారు.