విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరమ్ అధ్యక్షులు నేతి మహేశ్వరరావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు, ఆదాని గ్రూప్ స్కాం పై హిండెన్ బర్గ్ నివేదిక, పేపర్ లో వార్తల ఆధారంగా తయారు చేసిన నివేదిక పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడైతే ఆర్ధిక నేరాలు, ఆర్ధిక అంశాల్లో స్కామ్ల పై హిండెన్ బర్గ్ సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఆదాని గ్రూప్ ఇచ్చిన డేటా లో షేర్ మార్కెట్,బ్యాంకులు,బినామీ కంపెనీల ఏ విధంగా మనిపులేట్ చేశారో వివరాలు ఉన్నాయి. ఆ నివేదికపై 86 ప్రశ్నలు లేవనెత్తారు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆదాని కంపెనీకి ఉంది. దీనిపై దర్యాప్తు చేసిన పాత్రికేయులు చాలా మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారు. 2003-04 వరకు వినోద్ ఆదాని సోదరులు డైరెక్టర్లు గా ఉన్న వారికి ఆర్ధిక నేరాలతో సంబంధాలు ఉన్నాయని అయన అన్నారు.
స్టాక్ మార్కెట్లను బయట దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడం ద్వారా షేర్ మార్కెట్లను మార్పులు చేసుకున్నారు. సెబీ నిబంధనల ప్రకారం ప్రోమోటర్లకు 70 శాతం కన్నా ఎక్కువ ఉండకూడదు. కానీ బయట దేశాల నుంచి బినామీ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టి షేర్లకు కృత్రిమ ధరలు పెంచారు. ప్రభుత్వానికి తెలిసినా మిన్నకుండి పోయారు అంటే ప్రభుత్వ సహకారం ఆదానీకి పూర్తిగా ఉంది. 12 లక్షల కోట్ల బ్యాంకులు రుణాలు మాఫీ కూడా స్కాం లో భాగమేనని అన్నారు.
కార్పొరేట్ సంస్థల్లో ఆదాని కంపెనీలు పారదర్శకంగా ఉంటుంది అంటే అనుభవం లేని ఛార్టర్డ్ అకౌంటెంట్ లతో నివేదికలు ఇప్పించారు. ఆదాని పవర్పై అంతర్జాతీయ చార్టర్డ్ అకౌంట్ కంపెనీ ఇచ్చిన నివేదికలో అనేక లోపాలు చూపారు. అంతర్జాతీయంగా కోల్ స్కాం, పవర్, ఇతర స్కాం ల పై తయారు చేసిన నివేదికలో క్లుప్తంగా పొందుపరిచారు. ఎవరైతే ఈ స్కాములపై మాట్లాడారో వారిని అరెస్టులు చేశారు, చేయించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ సార్వభౌమత్వానికి మచ్చ. ఇన్ని స్కాం లు జరుగుతుంటే ఈడీ కి తెలియదా, అన్ని రేటింగ్ సంస్థలు రుణాలు ఇవ్వొద్దని చెప్పినా, బ్యాంకులు ఎందుకు రుణాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం చెప్పే మాటలకు చేస్తున్న అవినీతికి పొంతన లేదని అన్నారు.
అవినీతి బయట పడకుండా జాతీయ పతాకాన్ని అడ్డు పెట్టుకుని స్కాం బయట పెట్టిన విదేశీ సంస్థలపై దాడులు చేయించడానికా? రాష్ట్ర సమస్యలను గాలికొదిలి, ఎవరైతే కోట్లు ఖర్చు పెట్టి గెలవగలరో, భాజపాకు అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు ఆదాని కి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాయి,ప్రజలు ఏమి కావాలో ఆలోచించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ,ఇంత భారీ స్కాం పై ప్రతి ఒక్కరూ స్పందించాలి. రాజకీయాల్లో కార్పొరేట్ కంపెనీ ల జోక్యం నివారించాలని అన్నారు.