YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

జగన్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

న్యూ ఢిల్లీ జనవరి 27
జగన్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అహోబిలం మఠంపై ఏపీ ప్రభుత్వ కుట్రకు సుప్రీంకోర్టు బ్రేక్‌ వేసింది. అహోబిలం మఠం స్వాధీనం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఎత్తులను సుప్రీంకోర్టు చిత్తు చేసింది. మఠం సాధారణ కార్యకలాపాలతో ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎఎస్‌ ఓఖా ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాలను, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని.. ప్రభుత్వ జోక్యం అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అహోబిలం మఠంలో ఈఓ నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది.

Related Posts