YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో హంగ్ రాదు

తెలంగాణలో హంగ్ రాదు

స్థానిక సంస్థల ఎన్నికలో పోటీ చేయాలనుకునే వారు జనసమితి పార్టీ కి అప్లై చేసుకోవాలని కోరాం. విశేష స్పందన వస్తుంది ఇప్పటికే 1000 మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారు పూర్తిగా యువతనే అని టీజే యస్ అధ్యక్షుడు కోదండరామ్ వివరించారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 27 న వారికి స్థానిక సంస్థల అంశాల పై శిక్షణ కూడా ఇస్తామని అన్నారు.  దేశంలో ఊహించని విధంగా పెట్రో ధరలు పెరిగాయి. 2012 కంటే ఇప్పుడే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి. పెట్రో ధరలో సగం కు పైగా ట్యాక్స్ కే వెళుతుందని అన్నారు. తెలంగాణ లో పెట్రో మీద 35 శాతం ట్యాక్స్ వేస్తున్నారు. పెట్రో,డీజిల్ లు జీఎస్టీ పరిధిలో తెచ్చిఉంటే పెట్రో రేటు తగ్గే అవకాశం ఉంటుంది. పెట్రో,డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ట్యాక్స్ రేట్లను సవరించాలి. ప్రజల ఆకాంక్షలు జాతీయ పార్టీలు తీర్చలేదు. కర్నాటకలో అందుకే అలాంటి ఫలితాలు వచ్చయని అయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కింగ్ మేకర్ కాదు కింగే అవుతుంది. తెలంగాణ లో హాంగ్ రాదు. ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇస్తారని అయన అన్నారు. రాజకీయ పద్ధతులను మేము మారుస్తాం. రైతులో,యువకుల్లో మా పార్టీ పై ఆదరణ ఉంది. మొత్తం  119 స్థానాల్లో పోటీ చేస్తాం. జనసమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని అయన స్పష్టం చేసారు. 

Related Posts