YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే అదీప్ పూర్ ఫెర్మాఫాన్స్

ఎమ్మెల్యే  అదీప్  పూర్ ఫెర్మాఫాన్స్

విశాఖపట్టణం, జనవరి 30,
పెందుర్తి వైసీపీలో వర్గ రాజకీయాల అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే అదీప్ రాజు.. అనకాపల్లి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు మధ్య పోరు పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇరు వర్గాలు ఫ్లెక్సీల పాలిటిక్స్‌తో రెచ్చ గొట్టుకుంటున్నాయి. ఇటీవల పెందుర్తి 96వ వార్డు సచివాలయ కన్వీనర్ల నియామకం జరిగింది. 30మందితో కూడిన జాబితాను విడుదల చేసిన శరగడం వర్గం వాళ్లందరి ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే.. వాళ్లందరినీ ఇంటికి సాగనంపారు. ఇక సీఎం విశాఖ పర్యటనలోనూ ఎయిర్‌పోర్ట్ నుంచి ముషిడివాడ వరకు హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టారు. ఇక్కడా రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఎమ్మెల్యే ఫొటో కనిపించకుండా జాగ్రత్త పడిందట శరగడం శిబిరం.ఈ రచ్చ వెనుక బలమైన ఎత్తుగడలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. గవర సామాజికవర్గానికి చెందిన చినఅప్పలనాయుడు వచ్చే ఎన్నికల్లో అనకాపలి జిల్లాలో ఎక్కడో ఒక చోట టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఎమ్మెల్యే అదీప్ రాజుతో వైరానికి అదే కారణమట. ఈ దిశగా జరుగుతున్న కుట్రను అదీప్‌రాజు ఆలస్యంగా గుర్తించారని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఐప్యాక్‌ టీమ్‌ ఫోకస్‌ ఉంది. ఆ సంస్థ అందిస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్కులు పడుతున్నాయి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రోగ్రెస్ పూర్ గా ఉందనే నివేదిక హైకమాండ్ కు చేరింది.సుమారు 80రోజులు గడపగడపకు నిర్వహిస్తే కేవలం 13రోజులుగా నమోదవ్వడంపై అదీప్ రాజ్ ఖంగుతిన్నారట. ఎక్కడో తేడా కొడుతోందని ఆయన ఆరా తీశారట. రోజులు తప్పుగా నమోదు కావడం వెనుక శరగడం కుమారుడు ఉన్నట్టు ఎమ్మెలయే వర్గం ఆరోపణ. ఐ-ప్యాక్ టీమ్‌లో శరగడం కుమారుడు ఉన్నారని.. అతను ఇచ్చిన నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వల్లే పార్టీ పెద్దల దగ్గర బ్యాడైనట్టు అదీప్‌రాజు ఆవేదన చెందుతున్నారట. ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశమై ఆ విషయాన్ని చెప్పుకొని తన గోడు వెళ్లబోసుకున్నారట అదీప్‌రాజు. అక్కడ సీఎం ఏం చెప్పారో ఏమో.. శరగడం వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని వైసీపీ అధిష్ఠానం సూచించినట్టు ఎమ్మెల్యే శిబిరం ప్రచారం మొదలుపెట్టింది.ఇప్పటికే నియోజకవర్గ సమీక్షలో పెందుర్తి పంచాయితీ వాడి వేడిగా జరిగింది. శరగడం వర్గానికి గట్టిగానే సమన్వయకర్త సుబ్బారెడ్డి గట్టిగా చెప్పారని ఎమ్మెల్యే అనుచరుల టాక్‌. ఇరువర్గాల మధ్య ఇగో సమస్యలు నివారించేందుకు ఎన్నికల పరిశీలకురాలుగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి బాధ్యతలు అప్పగించింది. అదీప్, శరగడం వర్గాలు కలిసి పనిచేయాలని కీలకమైన విషయాలు సమన్వయకర్త నోటీసులో ఉంచాలని నిర్ధేశించినట్టు సమాచారం. అయితే ఎన్నికల ముందు కీలకమైన గవర సామాజికవర్గానికి చెందిన అప్పలనాయుడిని పార్టీ దూరం పెట్టే పరిస్థితి లేదు. అలాగని ఎమ్మెల్యేకు ఇబ్బందులు తలెత్తుతుంటే మౌనం వహించే అవకాశం లేదు. అందుకే పెందుర్తి పంచాయితీ భవిష్యత్‌లో మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది.

Related Posts