తమిళనాడు : తుత్తికూడిలో కమల్ కి చేదు అనుభవం. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంతకు చెందిన స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టగా పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కమల్ మీద బాధితుల బంధువులు మండిపడ్డారు. తమకు కమలహాసన్ ఓదార్పు అవసరం లేదని, ఆయన అక్కడకు రావడం వల్ల తాము మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నారు. దీంతో కమలహాసన్ షాక్ అయి తిరిగి వెళ్లారు.
#WATCH Makkal Needhi Maiam chief Kamal Haasan meets people who were injured in #SterliteProtest yesterday, at General Hospital in #Thoothukudi; family of victims say, 'we are facing difficulties due to your visit. Please leave from here' pic.twitter.com/o2Xbrql312
— ANI (@ANI) May 23, 2018