YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ , జనసేన పొత్తుపై ఏపీలో ఉత్కంఠ !

టీడీపీ , జనసేన పొత్తుపై ఏపీలో ఉత్కంఠ !

విజయవాడ, జనవరి 30, 
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ పొత్తులపై విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ మధ్యలో బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ప్రశ్నే లేదని చెబుతూ ఉంటారు. రెండు, మూడు రోజులకోసారి ఓ నేత వచ్చి.. తెలుగుదేశం పార్టీతో  బీజేపీ పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అసలు అలాంటి చాన్సే లేదని చెబుతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ నేతలెవరూ బీజేపీతో పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడటం లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రమే అత్యుత్సాహం చూపించి టీడీపీతో పొత్తు ఉండదనే ప్రకటనలు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు  ? దీని వెనుక రాజకీయం ఉందా ఏపీలో తెలుగుదేశం పార్టీ , జనసేన కలుస్తాయా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా కలుస్తాయని కొంత మంది..  కలవకపోవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఎవరి వాదనలు వారివి. అయితే రాజకీయవర్గాలు కూడా ఈ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అన్నదానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయం ఎలా ఉంటుందా అని చర్చిస్తున్నారు. అంతే కానీ బీజేపీ కూడా కలిస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయా ఆన్న ఆలోచన చేయడం లేదు. కూటమిలో బీజేపీ చేరినా చేరకపోయినా ఫలితాల్లో పెద్దగా మార్పు వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే  బీజేపీని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉంటుందన్న అర్థంలో తీర్మానం చేశారు. దీంతో బీజేపీ టీడీపీకి పొత్తు సంకేతాలు పంపిందని.. తమకు కూడా అంగీకారమేనన్న అభిప్రాయం చెప్పిందని రాజకీయవర్గాలు అంచనా వేయడం ప్రారంభించాయి. దీంతో జీవీఎల్ నరసింహారావు తెరపైకి వచ్చి..  అలా అన్నంత మాత్రాన టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని కాదని స్పష్టం చేశారు. మిర వైఎస్ఆర్‌సీపీతో పెట్టుకుంటారా.. అంటే అదేం లేదు..జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని చెబుతున్నారు. జనేన, బీజేపీ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అంటే బీజేపీ నేతలు.. ఏదో రాజకీయం చేస్తున్నారు... ఆ రాజకీయం ఏమిటన్నది బీజేపీ నేతలకు కూడా తెలుసా లేదా అన్నది స్పష్టత లేకుండా పోయింది. ఏపీ బీజేపీలో పొత్తు ఉండదని కొంత మంది నేతలు బహిరంగంగా చెబుతున్నారు... కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాల్సిందేనని.. కొంత మంది  బీజేపీ నేతలు హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పొత్తుపై ఏపీ బీజేపీలోని రెండు వర్గాలు తమదైన ప్రయత్నాలను ఢిల్లీలో చేస్తున్నారని అంటున్నారు. నిజానికి  హైకమాండ్ ఎప్పుడు చెప్పినా పొత్తుల గురించి ఏమీ మాట్లాడకుండా..ఒంటరిగా బలపడండి అనే సందేశమే ఇస్తుంది. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం తమ అజెండాను అమలు చేస్తూనే ఉంటారు. అయితే పొత్తుల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయానికి హైకమాండ్ విలువ ఇవ్వదని అంటున్నారు. జాతీయ రాజకీయాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. తమకు టీడీపీతో పొత్తు ఉండదనే ప్రకటన చేయకపోతే.. నిద్రపట్టదన్నట్లుగా అదే పనిగా ప్రకటనలు చేస్తూంటారు. విచిత్రంగా టీడీపీ నేతలు అసుల వీరి మాటల్ని పట్టించుకోనట్లు ఉంటున్నారు.

Related Posts