YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్

కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్

నెల్లూరు, ఫిబ్రవరి 2, 
అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఇప్పటికే ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ అంశం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీయడంతో ప్రభుత్వం వైపు నుంచి కూడా విచారణ చెయ్యాలని జగన్ సర్కార్ భావిస్తుంది. దీంతో హోం శాఖ అధికారులు సచివాలయంలో ఈ వ్యవహరంపై అంతర్గంగా సమావేశం అయ్యారు. కోటంరెడ్డి చేసిన ఆరోపణలు, బయటకి వచ్చిన ఆడియో టేపుల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో అటు పార్టీ పరంగా కోటంరెడ్డికి కౌంటర్ అటాక్ ఇవ్వడంతో పాటు, ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై కూడా అధికార యంత్రాంగంతో కూడా విచారణ చేయించడం ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తుంది.అటు ప్రభుత్వాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్దలతో పాటు అటు అధికార యంత్రాంగంతో ఆరాతీయించే పనిలో ఉన్నారు. కోటంరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు పరిశీలించడంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ వీడియోలు కూడా క్షుణ్నంగా పరిశీలించి, ఫోన్ ట్యాపింగ్ పేరుతో  ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీలో చేరతానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ రికార్డింగ్ లు బయటికి రావడంతో కుట్రలో భాగమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. విచారణలో థర్డ్ పార్టీతో ఎంకైరీ  చెయ్యించాలని, అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ చెయ్యించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఇవి అన్నిసాధ్యం కానీ పక్షంలో కేంద్ర ప్రభుత్వంలో పదవీ విమరణ చేసిన అధికారులతో నైనా ఈ విషయంపై అంతర్గతంగా విచారణ చేయిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని కుట్రలో ఎవరి భాగం ఎంత అన్నది కూడా తెలుస్తుందని సర్కార్ సీరియస్ గా పరిశీలిస్తుంది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రోజు రోజు కు కోటంరెడ్డి దూకుడు పెంచడంతో సీఎంవో నుంచి కూడా ఈ అంశంపై ఆరాతీస్తున్నారు. మంత్రులతో పాటు కేంద్ర పార్టీ కార్యాలయం వేదికగా నేతలతో సీఎంవో అధికారులు మాట్లాడడంతో పాటు పోలీస్, నిఘా వర్గాల నుంచి కూడా సీఎంవో అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజా గా కోటంరెడ్డి ఐఏఎస్ అధికారులను  కూడా ఇన్వాల్వ్ చెయ్యడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం విచారణ చేస్తుంది.
సీనియర్ నేతలు ఎదురుదాడి
ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూండటంతో సీనియర్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. పలువురు మాజీ మంత్రులు సీఎం జగన్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ట్యాపింగ్ అంశం పై కోటంరెడ్డికి మాజీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు.. చంద్రబాబు మంత్రి పదవిని ఆఫర్ చేసి ఉంటారని  అందుకే కోటం రెడ్డి టీడీపీలో చేరతానని ప్రకటన చేసినట్లుగా ఉందని కొడాలి అనుమానం వ్యక్తం చేశారు.  కోటంరెడ్డికి మంత్రి  పదవి ఇవ్వడం  సాధ్యం  కాదని  సీఎం  జగన్  చెప్పి   ఉండవచ్చని, అయితే కోటంరెడ్డి కన్నా  సీనియర్లు  చాలా  మంది ఉన్నారని నాని అన్నారు. మంత్రి  పదవి  ఆశించి   నా  దగ్గరకు  రావద్దని  జగన్  చెబుతున్నారని, ఎమ్మెల్యే  సీట్   ఇస్తా   పోటీ  చెయ్   అని  సీఎం  జగన్  స్పష్టంగా  చెబుతున్నారని చెప్పారు. సామాజిక  వర్గ  సమీకరణాలు  కూడా ముఖ్యమని అన్నారు. శ్రీకాంత్ రెడ్డి  ప్రసన్న  కుమార్  రెడ్డి  ఇలా  కొంత మంది  నేతలు  ఉన్నారని, బాలినేని మంత్రి పదవి   వదులు కున్న విషయాన్ని కొడాలి గుర్తు చేశారు. సీఎం  జగన్  ఫోన్ ట్యాపింగ్  చేసి   చెత్త  మాటలు వినాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ  ప్రతిపక్షం లో ఉండగా  23  మంది  పకోడీలు  వెళ్లిపోయారు  ఏమయ్యిందని నాని ప్రశ్నించారు. ఎస్సి  ఎస్టీ  బిసి  లకు  ఎన్ని  పడవులు  వచ్చాయి... అన్ని  అగ్ర కులాలకు ఇస్తే  ఎలా అన్న విషయాన్ని జగన్ ఆలోచించారని చెప్పారు. ఉండే వాళ్ళు  ఉంటారు  పోయే  వాళ్ళు  పోతారని, చంద్రబాబు  గాలి కబుర్లు  చెప్పారని ఓడించిన నేతలు ఇప్పుడు మరలా అక్కడికే వెళుతున్నారని వ్యాఖ్యానించారు.ప్రతి   మనిషి  ఫోన్ లో  రికార్డింగ్  యాప్  ఉంటుందని చెప్పారు. ప్రతి  కాల్  రికార్డ్  చేసి  సర్క్యులేట్  చెయ్యచ్చు ని, సీఎం జగన్ పై ఎబ్బెట్టు గా మాట్లాడారు  కాబట్టి  కాల్   రికార్డ్  పంపించారని పేర్ని నాని స్పష్టం చేశారు.  తాను కూడా ఎవరితో అలా మాట్లాడితే  పంపిస్తారని వ్యాఖ్యానించారు. టాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని, కేవలం బురద వేయడానికి  ఏదైనా చెప్తారని అన్నారు. సానుభూతి  కోసం  మాట్లాడతున్నారని, ఫోన్  ట్యాపింగ్  జరిగితే  అప్పుడే చెప్పాలి కదా అని ప్రశ్నించారు. ఆరు సార్లు  ఎమ్మెల్యేగా చేసినా  మంత్రి  పదవులు  లేవని, సామాజిక  వర్గ  కూర్పు లో  కొన్ని సార్లు  పదవులు  రావన్నారు. వైసీపీలో  జగన్  పై  అసంతృప్తి  ఉంటే, అది స్పష్టం చేసుకోవచ్చని చెప్పారు. జగన్  పార్టీ  పెట్టకపోతే  ఎవరైనా  ఎమ్మెల్యేలు  మంత్రులు  అవుతారా అని ఆయన ప్రశ్నించారు.  ట్యాపింగ్  పై ఎక్కడైనా   ఫిర్యాదు చేస్కోవచ్చని సవాల్ చేశారు.  ట్యాపింగ్ చేస్తే  భయపడాలని, టీడీపీ  నుంచి  పోటీ  చేస్తానని ఆయనే చెబుతున్నారు కాబట్టి..  ఆ విషయాలు అన్నీ కోటం రెడ్డికే తెలియాలన్నారు. న్యాయస్దానంలో  మాట్లాడిన మాటలు  బయట ప్రచారం చేయటం సరైంది కాదని అన్నారు. అయితే న్యాయమూర్తి మాట్లాడిన మాటలు  బయటకు ఎలా   వస్తాయని ఆయన ప్రశ్నించారు. న్యాయస్దానం  విషయంలో  అందరూ  సైలెంట్  గా  ఉన్నారా  అని ప్రశ్నించారు. వీళ్లంతా.. పోటుగాళ్లా ఇప్పుడు  మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ట్యాపింగ్  చేసే  సాఫ్ట్ వేర్ లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Related Posts