YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాగుంటకు మళ్లీ టిక్కెట్ లేనట్టేనా

మాగుంటకు మళ్లీ టిక్కెట్ లేనట్టేనా

ఒంగోలు, ఫిబ్రవరి 3, 
ఎంపీ మాగుంట స్థానంలో వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతికి వైసీపీ టిక్కెట్ కేటియిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి లాబీయింగ్‌తో పాటు ఇతరత్రా కారణాల నేపథ్యంలో ప్రశాంతికి ఎంపీ టిక్కెట్ దక్కుతుందని చెబుతున్నారు. సుదీర్ఘ కాలంలో రాజకీయాల్లో ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2019లో వైసీపీలో చేరిన మాగుంట ఒంగోలు ఎంపీగా రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జిల్లా రాజకీయ సమీకరణల నేపథ్యంలో మాగుంట అన్ని వర్గాలకు దూరం అయ్యారు. ముఖ‌్యంగా జిల్లాలో బాలినేని వర్గంతో మాగుంటకు విభేదాలు తలెత్తాయి. లిక్కర్ వ్యాపారాల్లో ఆరితేరన మాగుంట కుటుంబం ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెరపైకి వచ్చింది. ఆ కుంభకోణంతో తమకు సంబంధం లేదని మాగుంట తేల్చి చెప్పినా సిబిఐ నమోదు చేసిన అభియోగపత్రాల్లో మాగుంట కుటుంబ సభ్యుల్ని చేర్చారు. మరోవైపు జిల్లాలో ఇతర నేతలతో సయోధ్య లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు స్థానానికి ఇతరులతో పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.ఎంపీ మాగుంట శ్రీనివాస్ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా పెద్దగా వివాదాల్లోకి రాలేదు. అన్న మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా తమ వ్యాపారాలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. కాంగ్రెస్‌, టీడీపీలలో కొనసాగినా క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా ఆయన పేరు వినిపించేది కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం డిస్ట్రిలరీలలో తిరుగులేని ఆధిపత్యం కలిగి ఉన్న మాగుంట కుటుంబానికి ఇన్నాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది.ఇటీవలి కాలంలో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డితో మాగుంటకు విభేదాలు తలెత్తాయి. బాలినేని వివాదాల్లో చిక్కుకోవడానికి మాగుంటే కారణమని ప్రచారం జరిగింది. దీంతో బాలినేని సొంత పార్టీ వారే తనపై కుట్రలు చేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే కాళ్లు విరగ్గొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగిన వైసీపీలో మాగుంటకు ఇబ్బందులు తప్పడం లేదనే ప్రచారం కూడా ఉంది.వచ్చే ఎన్నికల్లో తన బదులు తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని మాగుంట కోరుతున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ఆయన్ని మనస్తాపానికి గురి చేసినట్లు చెబుతున్నారు. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన కొడుకు ప్రణీత్‌ను ఒంగోలు నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేనితో సరిపడక మాగుంట పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ ఆయన్ని టార్గెట్ చేసింది.మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2014కు ముందు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. వైఎస్‌ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీ వర్గంగా జగన్‌కు దూరంగా ఉండిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. 2019ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు. 2019కు ముందు వరకు వివాదాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. 2019 తర్వాత ఆయనకు చిక్కులు మొదలయ్యాయి. ఈ సారి వద్దనుకున్నా వివాదాలు చుట్టుముడుతున్నాయి. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలతో ఎంపీకి పొసగడం లేదు. టీడీపీ, బీజేపీలలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాలను మాగుంట ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.తాజాగా మాగుంట స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని నేతలు చర్చలేవనెత్తారు. అదే సమయంలో ఒంగోలు ఎమ్మెల్యే టిక్కెట్ బాలినేని, వైవీ సుబ్బారెడ్డిల్లో ఒకరికి దక్కుతుందని చెబుతున్నారు. జిల్లాలో అసమ్మతి నేతలకు చెక్ పెట్టేలా వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts