YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవీన్ ఎవరు...?

నవీన్ ఎవరు...?

కడప, ఫిబ్రవరి4, 
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన నవీన్ అనే పేరుపై అంతా ఆసక్తిగా అరా తీస్తున్నారు. 2019లో వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి రెండు ఫోన్ నంబర్లతో ఎక్కువ సార్లు మాట్లాడినట్లు గుర్తించిన సిబిఐ అధికారులు, ఆ నంబర్లు ఎవరివని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నవీన్ అనే పేరు తెరపైకి వచ్చింది.వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిన విచారించింది. గత నెల 28న సిబిఐ కార్యాలయంలో విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా ఈ పేరు వెల్లడైంది. ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో అన్ని వేళలా అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.నవీన్‌ కుటుంబం పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి దగ్గర వీరి కుటుంబం పని చేసేది. ఆ తర్వాత నవీన్‌ అలియాస్ హరిప్రసాద్, జగన్ దగ్గర పనిచేసేవారు.రాజారెడ్డి కాలంలో హరిప్రసాద్‌ అలియాస్ గోపరాజు నవీన్ కుటుంబీకులు దోబీ పని చేసేవారని గ్రామస్తులు చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన నవీన్ దాదాపు 15ఏళ్లుగా జగన్ దగ్గర పనిచేస్తున్నారు.జగన్‌తో పాటు బెంగళూరు, హైదరాబాద్‌లో లోటస్‌ పాండ్‌లో ఆయన దగ్గర పని చేశారు. 2018 చివరిలో జగన్‌ కుటుంబం తాడేపల్లికి మకాం మారినప్పుడు వారితో పాటు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా వారితోనే ఉంటున్నారు. జగన్‌ సతీమణి భారతికి వ్యక్తిగత సహాయకుడిగా ఇంటి పనులన్నీ చేసి పెడుతుంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఇంటి పనులు చేసిపెట్టడంతో పాటు అన్ని వేళలా అందుబాటులో ఉండటంతో అత్యవసర సమయాల్లో దగ్గరి బంధువులు అతనికే ఫోన్ చేసి సంప్రదిస్తుంటారని చెబుతున్నారు.క్రమంలోనే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన తర్వాత తెల్లవారు జామున తాడేపల్లిలో ఉండే నవీన్‌కు అవినాష్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా సీబీఐ గుర్తించింది. దీంతో నవీన్ ఎవరనే దానిపై సీబీఐ దృష్టి సారించింది. అతని మొదటి పేరు హరిప్రసాద్‌ కాగా... నవీన్‌గా పేరు మార్చుకున్నట్లు గుర్తించారు. సీబీఐ అధికారులు సోమవారం పులివెందులలో హరి ప్రసాద్‌ ఎవరని ఆరా తీశారు. వివేకా హత్య తర్వాత తాడేపల్లిలోని ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేందుకు నేరుగా వారి ఫోన్‌ నంబర్లను సంప్రదించకుండా నవీన్ నంబరుతో ఎందుకు మాట్లాడారని సిబిఐ విచారిస్తోంది.మరోవైపు నవీన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసంలో పదిహేనేళ్ళుగా పనిచేస్తున్నాడని, ముఖ్యమంత్రి సతీమణి భారతితో తాను మాట్లాడాలన్నా ఇతర నంబర్లు అందుబాటులోకి రాకపోతే నవీన్‌కు ఫోన్ చేస్తానని సుబ్బారెడ్డి చెప్పారు. నవీన్‌కు సిబిఐ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన సుబ్బారెడ్డి, నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతాడని అందులో తప్పేముందని చెప్పారు. ఈ విషయాన్ని పత్రికల్లో భూతద్దాల్లో చూపించారని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి, సీబీఐ అధికారులు మాత్రమే ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయాలు పత్రికలకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. ఈ విషయంపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Related Posts