YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మైనార్టీలతో భారీ బహిరంగసభకు ప్లాన్

మైనార్టీలతో భారీ బహిరంగసభకు ప్లాన్

విజయవాడ, ఫిబ్రవరి 4, 
బీసీ మహాసభ విజయవంతం తర్వాత తాడేపల్లిలో  ముస్లిం మైనారిటీ నేతల అంతర్గత సమావేశాన్ని వైఎస్ఆర్సీపీ నిర్వహించింది.  దాదాపు వెయ్యిమందికి పైగా మైనారిటీ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.  ఉప ముఖ్యమంత్రి అంజాత్ బాషాతో పాటు కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నూరి ఫాతిమా, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, ఇసాక్ బాషా, షేక్ మహమ్మద్ ఇక్బాల్, ఖాదర్ బాషా, మరియు వక్ఫ్ బోర్డు చైర్‌పర్సన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభ్యున్నతి సాధికారత కోసం చేసిన విస్తృతమైన కృషిని  వివరించారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మైనార్టీల సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు.  సామాజిక భద్రత, రాజకీయ ప్రాతినిథ్యం, ఉన్నత విద్యకు భరోసా కల్పించారు.
1) ముస్లింల సంక్షేమ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని రాష్ట్రంలోని ప్రతి మైనారిటీ ఇంటికి తీసుకెళ్లాలి.
2) ఉలేమాలు, ఇమామ్‌లు, మౌజాన్‌లు, మసీద్ కమిటీ సభ్యులు, మదర్సా వక్ఫ్ బోర్డ్ నిర్వాహకులను కలిసి వారి ఆకాంక్షలు తెలుసుకోవడానికి కృషి చేయాలి.
3) ముస్లిం మైనార్టీల్లోని ప్రభావవంతమైన కుటుంబాలను, వ్యక్తులను పార్టీ అగ్రనాయకత్వం వ్యక్తిగతంగా కలిసుకుని అభినందించాలి.  వైఎస్ఆర్సీపీకి మద్దతు కోరాలి. 4) సీఎం జగన్ సందేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు సంపూర్ణ మద్దతు కోరేందుకు భారీస్థాయిలో ముస్లిం మైనారిటీ మహా సభ నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ.10,309 కోట్లు, నాన్-డిబిటి పథకాల ద్వారా రూ.10,053.04 కోట్లు పంపిణీ చేసింది. 2014-2019లో గత ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ. 2,665 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో రూ. 20,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. మైనారిటీల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బు గత టీడీపీ ప్రభుత్వం చేసిన దానికంటే పదిరెట్లు ఎక్కువ అని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా పేద ముస్లింల కుటుంబాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద 3.89 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కరోనా కాలంలో 8.1 లక్షలకు పైగా ముస్లిం కుటుంబాలకు రూ. 81 కోట్ల సహాయం అందించారు. మెరుగైన విద్యావకాశాలను అందించేందుకు అమ్మ ఒడి పథకం కింద 4.73 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు రూ. 15,000 ఆర్థికసాయం అందజేశారు.  జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 2.36 లక్షల మందికి, వసతి దీవెన పథకం కింద 2.21 లక్షల మంది ముస్లిం విద్యార్థులు లబ్ధి పొందారు.వైఎస్ఆర్ చేయూత కింద 45 ఏళ్లు పైబడిన 3.07 లక్షల మంది ముస్లిం మహిళలు ఆర్థిక సహాయం పొందారు. వైఎస్ఆర్ సున్న వడ్డీ ద్వారా స్వయం సహాయక సంఘాలలోని 6.66 లక్షల మంది ముస్లిం మహిళలకు ఉచిత రుణాలు అందించారు. YSR షాదీ తోఫా కింద, ముస్లిం వధువులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తానని సీఎం జగన్ హామీ ప్రకారం ఆక్రమణకు గురైన దాదాపు 32,000 ఎకరాల వక్ఫ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇమామ్‌ల గౌరవవేతనం నెలకు రూ.10,000  మౌజన్‌ల గౌరవ వేతనం నెలకు రూ.5,000కు పెంచారు.

Related Posts